ప్యారిస్ ఒలింపిక్స్‌లో పసిడి పతకం సాధించిన పాకిస్తాన్ అథ్లెట్, బల్లెం వీరుడు అర్షద్ నదీమ్‌పై కాసుల వర్షం కురుస్తోంది. పంజాబ్ ప్రావిన్స్ రాష్ట్రం ముఖ్యమంత్రి మరియం నవాజ్ (మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ కుమార్తె) ఒలింపిక్ చాంపియన్‌కు పాకిస్తాన్ కరెన్సీలో రూ. 10 కోట్లు (భారత కరెన్సీలో రూ. 3 కోట్లు) నజరానా ప్రకటించారు.
ఇప్పటికే కరాచీ మేయర్ ముర్తాజా వహాబ్ సైతం రూ. 5 కోట్లు (భారత కరెన్సీలో రూ. 1.50 కోట్లు) నగదు బహుమతి ఇవ్వనున్నట్లు ప్రకటించారు. కాగా గురువారం(ఆగస్టు 8) ఆర్ధరాత్రి జరిగిన జావెలిన్ త్రో ఫైనల్లో ఈటెను 92.97 మీటర్ల దూరం విసిరిన అర్షద్.. తొలి ఒలింపిక్ స్వర్ణ పతకాన్ని కైవసం చేసుకున్నాడు.
తద్వారా ఒలింపిక్స్ చరిత్రలో పాక్ తరపున వ్యక్తిగత విభాగంలో బంగారు పతకం సాధించిన తొలి అథ్లెట్‌గా నదీమ్ నిలిచాడు. కాగా ఈ పోటీల్లో రెండో స్ధానంలో నిలిచిన భారత స్టార్ జావెలిన్ త్రోయర్ నిరజ్ చోప్రా రజత పతకాన్ని కైవసం చేసుకున్నాడు.
Comments
Please login to add a commentAdd a comment