ఇమానే ఖలీఫ్(Imane Khelif).. ప్యారిస్ ఒలింపిక్స్-2024 సందర్భంగా ఈ అల్జీరియా బాక్సర్ పేరు చర్చనీయాంశమైంది. తాజాగా తను మరోసారి వార్తల్లోకి వచ్చింది. ఆమె.. ఆమె కాదు.. మగాడే.. అనే ఆధారాలు ఉన్నాయంటూ జాఫర్ ఐత్ ఔడియా అనే ఫ్రెంచి జర్నలిస్టు ఇమానే గురించి సంచలన విషయాలు బయటపెట్టారు.
కౌమార దశలో
తాను సంపాదించిన డాక్యుమెంట్లలో ఇమానే 5- ఆల్ఫా రెడక్టేస్ డెఫిషియెన్సీతో బాధపడుతోందని వెల్లడైందని పేర్కొన్నారు. అంతేకాదు... ఈ రిపోర్టులో ఇమానే హార్మోన్ థెరపీ చేయించుకుంటే లింగ నిర్ధారణ సులువవుతుందనే సిఫారసు ఉందని.. తన జెండర్ గుర్తింపునకు ఇది దోహదం చేస్తుందనే వివరాలూ ఉన్నాయన్నారు. కాగా 5- ఆల్ఫా రెడక్టేస్ డెఫిషియెన్సీ అనేది ఓ అరుదైన డిజార్డర్.
ఒక వ్యక్తిలో పురుష అవయవాల్లో సరైన ఎదుగుదల లేకపోవడం వల్ల.. పుట్టుకతో బయోలాజికల్‌గా మహిళగా కనిపిస్తారు. అయితే, కౌమార దశలో మాత్రం పురుష అవయవాలు అభివృద్ది చెందుతాయని వైద్య నిపుణులు చెబుతున్నారు.
అప్పుడు నిషేధం
ఇదిలా ఉంటే.. 2023లో ఇమానే ఖలీప్ జెండర్‌కు సంబంధించిన కథనం వెలుగులోకి వచ్చింది. ఆమెకు గర్భసంచి లేదని, పురుషులలో ఉండే XY క్రోమోజోమ్‌లు ఉన్నాయని.. ఫలితంగా ఇమానే బయోలాజికల్ మ్యాన్ అనే వార్తలు బయటకువచ్చాయి. ఈ క్రమంలో.. గత ఏడాది ఢిల్లీలో జరిగిన బాక్సింగ్ వరల్డ్ చాంపియన్‌షిప్‌లో పరీక్షల తర్వాత.. మహిళల విభాగంలో పాల్గొనకుండా ఆమెపై నిషేధం విధించారు.
కానీ.. ప్యారిస్ ఒలింపిక్స్‌లో మాత్రం నిర్వాహకులు వుమెన్ కేటగిరీలోని 66 కేజీల విభాగంలో పాల్గొనే అవకాశం ఇమానేకు ఇచ్చారు. ఆమె పాస్‌పోర్టులో మహిళ అని ఉందనే కారణంగా.. ఈ మేరకు అనుమతించారనే వార్తలు విమర్శలకు తావిచ్చాయి.
46 సెకన్ల వ్యవధిలోనే
అందుకు తగ్గట్లుగానే.. తన మొదటి బౌట్‌లో ఇటలీకి చెందిన ఏంజెలా కెరీనీతో తలపడ్డ ఇమానే.. తన పంచ్‌లతో ప్రత్యర్థిని బెంబేలెత్తించింది. ఇమానే పంచ్‌లను తట్టుకోలేక ఏంజెలా కేవలం 46 సెకన్ల వ్యవధిలోనే ఆట నుంచి వైదొలిగింది.
ఇలాంటి బాక్సింగ్ తన జీవితంలో చూడలేదంటూ ఏంజెలా ఏడ్చేసింది. ఈ క్రమంలో ఖలీఫ్ పంచ్‌లలో ఒక మగాడి తరహాలో తీవ్రత ఉండటమే అందుకు కారణమని ఆరోపణలు వచ్చాయి. అయితే, నిర్వాహకులు మాత్రం ఇమానేను ఈవెంట్లో కొనసాగించారు.
బంగారు పతకం గెలిచి
ఈ నేపథ్యంలో ప్రత్యర్థులపై బలమైన పంచ్‌లతో పంజా విసిరిన 25 ఏళ్ల ఇమానే ఖలీఫ్ ఫైనల్ చేరడమే గాక.. బంగారు పతకం గెలిచింది. కానీ ఇమానేను ప్రశంసించేవారి కంటే.. ఆమె జెండర్ ఐడెంటిని ప్రస్తావిస్తూ విమర్శించిన వారే ఎక్కువయ్యారు.
తాజాగా ఫ్రెంచి జర్నలిస్టు బయటపెట్టిన విషయాలతో ఆమె మగాడేనని.. మహిళా బాక్సర్లపై పోటీ పడిన ఇమానే పతకాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నారు.
పతకం వెనక్కి తీసుకోవాలి
టీమిండియా దిగ్గజ స్పిన్ బౌలర్ హర్భజన్ సింగ్ కూడా ఈ జాబితాలో చేరాడు. ‘‘స్వర్ణ పతకాన్ని వెంటనే వెనక్కి తీసుకోండి. ఒలింపిక్స్ నిర్వాహకులు ఇలాంటివి ప్రోత్సహించడం సరికాదు’’ అని భజ్జీ ట్వీట్ చేశాడు.
కాగా 1999 నుంచి మహిళా బాక్సర్లకు క్రోమోజోమ్ టెస్టులు నిర్వహించే బదులు.. వారి అధికారిక పత్రాలనే జెండర్ ప్రూఫ్‌లుగా అంతర్జాతీయ ఒలింపిక్స్ సంఘం ఆమోదిస్తోంది. ఇమానే ఖలీఫ్ వివాదంతో ఈ విషయం మరోసారి చర్చకు వచ్చింది.
చదవండి: భార్యతో విడాకులు.. ‘మిస్టరీ గర్ల్’తో శిఖర్ ధావన్! వీడియో వైరల్
Take the Gold back @Olympics This isn’t fair https://t.co/ZO3yJmqdpY
— Harbhajan Turbanator (@harbhajan_singh) November 5, 2024
Comments
Please login to add a commentAdd a comment