పారిస్: తొలిసారి ఒలింపిక్స్‌లో పోటీపడుతున్న భారత స్టార్ బాక్సర్, తెలంగాణ అమ్మాయి నిఖత్ జరీన్ తన పంచ్‌పవర్ చాటింది. మహిళల 50 కేజీల విభాగంలో తిరుగులేని ఆధిపత్యం కనబర్చిన నిఖత్ ప్రిక్వార్టర్స్‌కు దూసుకెళ్లింది. ఆదివారం జరిగిన తొలి రౌండ్ బౌట్‌లో నిఖత్ 5–0తో మ్యాక్సీ కరీనా క్లోట్జెర్ (జర్మనీ)పై విజయం సాధించింది. రెండుసార్లు ప్రపంచ చాంపియన్ నిఖత్ బౌట్ ఆరంభం నుంచే ప్రత్యరి్థపై పంచ్‌ల వర్షం కురిపించగా... తన ఎత్తును సద్వినియోగ పర్చుకుంటూ జర్మనీ బాక్సర్ కూడా దీటైన పంచ్‌లు విసిరింది.
అయితే రెండో రౌండ్‌లో తేరుకున్న నిఖత్.. కీలక సమయాల్లో హుక్స్, జాబ్స్‌తో పాయింట్లు కొల్లగొట్టి విజేతగా నిలిచింది. గురువారం జరగనున్న ప్రిక్వార్టర్స్‌లో ఫ్లయ్ వెయిట్ ప్రపంచ చాంపియన్ వూ యూ (చైనా)తో నిఖత్ తలపడనుంది. మరోవైపు మహిళల 54 కేజీల విభాగంలో భారత బాక్సర్ ప్రీతి పవార్ కూడా ప్రిక్వార్టర్స్‌లో అడుగుపెట్టింది. తొలి రౌండ్‌లో ప్రీతి 5–0తో వియత్నాం బాక్సర్ వో థీ కిమ్‌పై ఏకపక్ష విజయం సాధించింది.
Comments
Please login to add a commentAdd a comment