కామన్‌వెల్త్ క్రీడల టేబుల్ టెన్నిస్ (టీటీ) పురుషుల టీమ్ విభాగంలో డిఫెండింగ్ చాంపియన్ భారత్ సెమీఫైనల్లోకి అడుగు పెట్టింది. ఆదివారం జరిగిన క్వార్టర్ ఫైనల్లో భారత్ 3–0తో బంగ్లాదేశ్‌ను ఓడించింది. తొలి మ్యాచ్‌లో హర్మీత్–సత్యన్ జ్ఞానశేఖరన్ ద్వయం 11–8, 11–6, 11–2తో రమిహిమిలన్–అహ్మద్ జంటను ఓడించింది. రెండో మ్యాచ్‌లో శరత్ కమల్ 11–4, 11–7, 11–2తో రిఫాత్‌పై గెలిచాడు. మూడో మ్యాచ్‌లో జ్ఞానశేఖరన్ 11–2, 11–3, 11–5తో అహ్మద్‌పై నెగ్గి భారత విజయాన్ని ఖాయం చేశాడు.
Comments
Please login to add a commentAdd a comment