బర్మింగ్‌హమ్: ప్రతిష్టాత్మక కామన్‌వెల్త్ గేమ్స్ 2022లో టీమిండియా మహిళల జట్టు బుధవారం(ఆగస్టు 3న) బార్బడోస్‌తో కీలక మ్యాచ్ ఆడనుంది. ఒక రకంగా భారత్‌కు ఇది డూ ఆర్ డై మ్యాచ్ అని చెప్పొచ్చు. చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో గెలిచి ఆత్మవిశ్వాసం కూడగట్టుకున్న హర్మన్ ప్రీత్ సేన బార్బడోస్‌తో గెలిస్తేనే ముందుకు వెళుతుంది. పాక్‌పై గెలిచి.. ఆస్ట్రేలియాతో ఓటమి చవి చూసిన భారత్.. బార్బడోస్‌తో గెలిస్తే సెమీస్‌కు చేరుకుంటుంది.
అటు బార్బడోస్ జట్టుది కూడా అచ్చం ఇదే పరిస్థితి. పాకిస్తాన్‌పై విజయం.. ఆసీస్‌తో చేతిలో ఓటమితో ఆ జట్టకు కూడా భారత్‌తో మ్యాచ్ కీలకం కానుంది. మరి తొలిసారి టీమిండియా మహిళలు ఆడుతున్న కామన్‌వెల్త్ గేమ్స్‌లో సెమీస్‌కు చేరి పతకం దిశగా అడుగులు వేస్తారా లేదా అన్నది ఆసక్తికరంగా మారింది. భారత కాలమాన ప్రకారం రాత్రి 10:30 గంటలకు మ్యాచ్ జరగనుంది. టీమిండియా వుమెన్స్‌లో స్మృతి మంధాన, హర్మన్ ప్రీత్ కౌర్, షఫాలీ వర్మలు ఫామ్‌లో ఉండడం సానుకూలాంశం.
ఇక ఇతర మ్యాచ్‌లు పరిశీలిస్తే.. భారత పరుషుల, మహిళల హాకీ జట్టు కెనడాతో అమితుమీ తేల్చుకోనుండగా.. బాక్సర్లు లవ్లీనా బొర్హంగైన్, నికత్ జరీన్, నీతు గంగాస్‌లు క్వార్టర్ ఫైనల్లో తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు.
ఆరవ రోజు భారత్ ఆటగాళ్లు పాల్గొనబోయే మ్యాచ్‌ల షెడ్యూల్.. పూర్తి వివరాలు
అథ్లెటిక్స్:
మహిళల షాట్‌పుట్ ఫైనల్ - మన్‌ప్రీత్ కౌర్ (గురువారం ఉదయం 12.35)
పురుషుల హైజంప్ ఫైనల్ - తేజస్విన్ శంకర్ (11.30 pm )
బాక్సింగ్
మహిళల 45kg-48 kg క్వార్టర్ ఫైనల్స్ – నీతు గంగాస్ (సాయంత్రం 4.45)
48-50 కిలోల (లైట్ ఫ్లై వెయిట్) క్వార్టర్ ఫైనల్స్ – నిఖత్ జహ్రీన్ (11.15 PM)
66-70 కిలోల (లైట్ మిడిల్ వెయిట్) క్వార్టర్-ఫైనల్ - లోవ్లినా బోర్గోహైన్ (12.45 AM)
పురుషులు 54-57 కేజీలు (ఫెదర్ వెయిట్) క్వార్టర్ ఫైనల్స్ – హుస్సామ్ ఉద్దీన్ మహమ్మద్ (సాయంత్రం 5.45)
క్రికెట్
మహిళల T20 - భారతదేశం వర్సెస్ బార్బడోస్ - 10.30 PM
హాకీ
మహిళల పూల్ A - ఇండియా వర్సెస్ కెనడా - 3.30 PM
పురుషుల పూల్ B - ఇండియా వర్సెస్ కెనడా - 6.30 PM
జూడో
మహిళల 78 కేజీల క్వార్టర్-ఫైనల్ - తులికా మన్ - మధ్యాహ్నం 2.30 PM
పురుషుల 100 కేజీల ఎలిమినేషన్ రౌండ్ 16 - దీపక్ దేశ్వాల్ - మధ్యాహ్నం 2.30 PM
లాన్ బౌల్స్
పురుషుల సింగిల్స్ - మృదుల్ బోర్గోహైన్ - 1 PM- 4 PM
మహిళల జంట - భారతదేశం vs నియు - 1 PM - 4 PM
పురుషుల ఫోర్- భారత్ vs కుక్ ఐలాండ్స్ మరియు ఇంగ్లండ్ - రాత్రి 7.30-10.30 PM
మహిళల ట్రిపుల్ - ఇండియా vs నియు - 7.30 PM
స్క్వాష్
మిక్స్‌డ్ డబుల్స్ రౌండ్ ఆఫ్ 32 వర్సెస్ శ్రీలంక - 3.30 PM
వెయిట్‌లిఫ్టింగ్:
పురుషుల 109 కేజీలు - లోవ్‌ప్రీత్ సింగ్ - 2 PM
మహిళల 87 కేజీలు - పూర్ణిమ పాండే - సాయంత్రం 6.30 PM
పురుషుల 109+కేజీలు - గుర్దీప్ సింగ్ - రాత్రి 11 PM
𝙄𝙩 𝙝𝙖𝙥𝙥𝙚𝙣𝙨 𝙤𝙣𝙡𝙮 𝙖𝙩 𝙩𝙝𝙚 𝘾𝙤𝙢𝙢𝙤𝙣𝙬𝙚𝙖𝙡𝙩𝙝 𝙂𝙖𝙢𝙚𝙨 🙌
— Team India (@WeAreTeamIndia) August 2, 2022
Guess who were out there to cheer for our women's hockey team?😎💪
🏏@BCCIWomen 🤝 @TheHockeyIndia🏑
📷 @imharleenDeol/@WeAreTeamIndia | #B2022 pic.twitter.com/KHyw61Qvja
చదవండి: CWG 2022: పీవీ సింధు మాత్రమే.. బ్యాడ్మింటన్ మిక్స్‌డ్ టీమ్‌కు రజతం
Comments
Please login to add a commentAdd a comment