
కామన్ వెల్త్ గేమ్స్-2022లో భారత్‌కు మరో రెండు పతకాలు ఖాయమయ్యాయి. జూడో 48 కేజీ విభాగంలో భారత అథ్లెట్ సుశీలా దేవి లిక్మాబమ్ ఫైనల్‌కు చేరుకుంది. సోమవారం జరిగిన సెమీఫైనల్‌లో మారిషస్‌కు చెందిన ప్రిస్సిల్లా మోరాండ్‌పై సుశీలా దేవి విజయం సాధించి పతకాన్ని ఖాయం చేసుకుంది. ఒక వేళ ఫైనల్లో సుశీలా దేవి దేవి ఓటమి చెందిన రజత పతకమైన భారత్ ఖాతాలో చేకూరుతుంది.
మరో వైపు లాన్ బౌల్స్ క్రీడలో భారత జట్టు ఫైనల్లో అడుగుపెట్టింది. మహిళల ఫోర్స్ లాన్ బౌల్స్ జట్టు సెమీఫైనల్లో న్యూజిలాండ్‌ను 16-13తో ఓడించింది. తత్వారా కామన్ వెల్త్ గేమ్స్‌లో మరో పతకం భారత్ ఖాతాలో చేరనుంది. కాగా లాన్ బౌల్స్ క్రీడలో భారత్ తొలి సారి పతకం సాధించబోతుండడం గమనార్హం. ఇక కామన్ వెల్త్ గేమ్స్‌లో భారత అథ్లెట్‌లు సత్తా చాటుతున్నారు. ఇప్పటి వరకు భారత్ ఖాతాలో ఇప్పటికే ఆరు పతకాలు ఉన్నాయి.
వాటిలో మూడు గోల్డ్ మెడల్స్, రెండు రజత పతకాలు, ఒక్క కాంస్య పతకం ఉంది. కాగా ఇప్పటి వరకు భారత అథ్లెట్‌లు సాధించిన పతకాలన్నీ వెయిట్ లిఫ్టింగ్‌లో సాధించినవే కావడం విశేషం. మహిళల కేటగిరిలో మీరాబాయ్ చాను 49 కేజీల విభాగంలో స్వర్ణం, జెరెమీ లాల్‌రిన్నుంగ 67 కేజీల విభాగంలో స్వర్ణం, 73 కేజీల విభాగంలో అచింత షెవులి స్వర్ణం, 55 కేజీల విభాగంలో సంకేత్ మహదేవ్ సార్గర్ రజతం, 55 కేజీల విభాగంలో బింద్యారాణి దేవి రజతం, 61 కేజీల విభాగంలో గురురాజ్ పూజారి కాంస్య పతకం సాధించారు.
చదవండి: Mirabai Chanu: ‘పుత్రికోత్సాహం’తో పొంగిపోయిన మీరాబాయి తల్లి! వీడియో వైరల్
Comments
Please login to add a commentAdd a comment