న్యూఢిల్లీ: ఈ ఏడాది జరిగే టోక్యో ఒలింపిక్స్‌లో భారత క్రీడాకారులు గతంలో ఎన్నడూలేని విధంగా అత్యుత్తమ ప్రదర్శన కనబరుస్తారని కేంద్ర క్రీడల మంత్రి కిరణ్ రిజిజు ఆకాంక్షించారు. టోక్యో ఒలింపిక్స్ కౌంట్‌డౌన్ బుధవారంతో 100 రోజులకు చేరింది. ఈ సందర్భంగా జరిగిన వర్చువల్ వెబీనార్ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ‘ఈసారి జరిగే ఒలింపిక్స్ భారత చరిత్రలో ఒక తీపి గుర్తు కావాలనుకుంటున్నాం. అందుకోసం మంత్రి త్వ శాఖ తరఫున చేయాల్సిందంతా చేశాం. ఒలింపిక్స్ కోసం సిద్ధమవుతున్న క్రీడాకారులకు సకల సదుపాయాలను కల్పించాం. ఇప్పడంతా మీ (అథ్లెట్లు) చేతుల్లోనే ఉంది. రెండంకెల్లో పతకాలను సాధిస్తారని ఆశిస్తున్నాను’ అని కిరణ్ రిజిజు వ్యాఖ్యానించారు. ఓవరాల్‌గా ఒలింపిక్స్ చరిత్రలో భారత అత్యుత్తమ ప్రదర్శన 2012 లండన్ ఒలింపిక్స్‌లో వచ్చింది. లండన్ ఒలింపిక్స్‌లో భారత్‌కు అత్యధికంగా ఆరు పతకాలు (రెండు రజతాలు, నాలుగు కాంస్యాలు) లభించాయి.
Comments
Please login to add a commentAdd a comment