ముంబై: భారత అథ్లెట్లు సుధా సింగ్, నితేంద్ర సింగ్ రావత్ ముంబై మారథాన్‌లో మెరిశారు. మహిళల, పురుషుల విభాగాల్లో భారత్ తరఫున మెరుగైన స్థానంలో నిలిచారు. సుధ 2 గంటల 34 నిమిషాల 56 సెకన్లలో పరుగును పూర్తిచేసి దోహాలో జరిగే ప్రపంచ చాంపియన్‌షిప్ కోసం నిర్దేశించిన 2:37:00 క్వాలిఫయింగ్ మార్క్‌ను అధిగమించింది.
రావత్ 2:15:52 సెకన్ల టైమింగ్‌తో మెరిశాడు. పురుషుల కేటగిరీలో 2:16:00 క్వాలిఫయింగ్ మార్క్‌ను నితేంద్రసింగ్ అధిగమించాడు. ఈ మారథాన్‌లో కాస్మస్ లగత్ (కెన్యా; 2:09:15) పురుషుల విభాగంలో విజేతగా నిలువగా... మహిళల కేటగిరీలో వర్క్‌నెష్ అలెము (ఇథియోపియా; 2:25:45) గెలిచింది.
ముంబై మారథాన్‌లో మెరిసిన సుధా సింగ్
Published Mon, Jan 21 2019 1:23 AM | Last Updated on Mon, Jan 21 2019 1:23 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment