పారాలింపిక్స్‌కు భారత్ నుంచి 17 మంది
శుభాకాంక్షలు తెలిపిన ప్రధాని
న్యూఢిల్లీ: ఈనెల 7 నుంచి 18 వరకు రియోలో జరిగే పారాలింపిక్స్ గేమ్స్ కోసం ఈసారి భారత్ నుంచి 17 మంది అథ్లెట్లు బరిలోకి దిగుతున్నారు. ఈ గేమ్స్ చరిత్రలో ఇంతమంది భారతీయులు పాల్గొనడం ఇదే తొలిసారి. ఇందులో 15 మంది పురుషులు, ఇద్దరు మహిళా అథ్లెట్లు ఉన్నారు. ఐదు ఈవెంట్లలో వీరు బరిలోకి దిగుతారు. రియోకు వెళుతున్న భారత అథ్లెట్లకు ప్రధాని నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలిపారు. ‘పారాలింపిక్స్ గేమ్స్ కోసం వెళుతున్న ఆటగాళ్లపై దేశమంతా ఆసక్తి చూపడంతో పాటు వారికి అభినందనలు తెలుపుతోంది. కచ్చితంగా వారు మెరుగైన ప్రదర్శనతో దేశం గర్వించేలా చేస్తారని భావిస్తున్నాను’ అని ప్రధాని ట్వీట్ చేశారు.
పాకిస్తాన్ 247/8