అమెరికాలోని యుజీన్ వేదికగా జరుగుతోన్న వరల్డ్ అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్‌లో భారతీయ లాంగ్ జంప్ అథ్లెట్ మురళీ శ్రీశంకర్ చరిత్ర సృష్టించాడు. శనివారం జరిగిన క్వాలిఫికేషన్స్ రౌండ్‌లో 8 మీటర్ల జంప్ చేసిన శ్రీశంకర్ పురుషుల లాంగ్‌జంప్ విభాగంలో ఫైనల్‌కు అర్హత సాధించాడు. తద్వారా ప్రపంచ అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్స్ లాంగ్‌జంప్‌లో ఫైనల్‌కు చేరిన తొలి పురుష అథ్లెట్‌గా శ్రీశంకర్ రికార్డులకెక్కాడు. కాగా 2003 పారిస్ వేదికగా వరల్డ్ అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్ మహిళల లాంగ్ జంప్ విభాగంలో పతకం సాధించిన తొలి భారతీయరాలుగా అంజు బాబీ జార్జ్ నిలిచింది. ఇక ఇదే ఈవెంట్‌లో పోటీ పడ్డ మరో ఇద్దరు భారత అథ్లెట్‌లు జస్విన్ ఆల్డ్రిన్ (7.79 మీ), మొహమ్మద్ అనీస్ యాహియా (7.73 మీ) లు ఫైనల్‌కు ఆర్హత సాధించ లేకపోయారు.
అదే విధంగా ఈ టోర్నీలో అవినాష్ సాబ్లే 3వేల మీటర్ల స్టీపుల్‌చేజ్ క్రీడలో 8:18.75 టైమింగ్‌తో మూడవ స్థానంలో నిలిచి.. ఫైనల్‌కు అర్హత సాధించాడు. భారత ఆర్మీ ఉద్యోగి అయినా అవినాష్ 8:8:75 నిమిషాల్లో పూర్తిచేసి నేరుగా ఫైనల్లో అడుగు పెట్టాడు.
చదవండి: World Athletics Championships: 90 మీటర్లే టార్గెట్‌గా.. వరల్డ్ చాంపియన్‌షిప్‌లో నీరజ్ చోప్రా
Comments
Please login to add a commentAdd a comment