Asian Games 2023 India Medals: ఆసియా క్రీడలు-2023లో భారత అథ్లెట్లు దుమ్ములేపారు. పురుషుల 10 వేల మీటర్ల పరుగు పందెంలో రజత, కాంస్య పతకాలు రెండూ మనోళ్లే కైవసం చేసుకున్నారు. కార్తిక్ కుమార్, గుల్వీర్ సింగ్ ఈ అద్భుతం చేశారు.
చైనాలోని హోంగ్జూ వేదికగా శనివారం సాయంత్రం జరిగిన రేసులో ఈ ఇద్దరూ తమ వ్యక్తిగత అత్యుత్తమ ప్రదర్శనలతో సిల్వర్, బ్రాంజ్ మెడల్స్ గెలవడం గమనార్హం. కార్తిక్ 28:15.38, గుల్వీర్ 28:17.21 నిమిషాల్లో పరుగు పూర్తి చేయడం విశేషం.
వరల్డ్ నంబర్ 2 జోడీని ఓడించి..
ఇదిలా ఉంటే.. టేబుల్ టెన్నిస్ వుమెన్స్ డబుల్స్ విభాగంలో భారత ప్లేయర్లు ఐహిక, సుతీర్థ సెమీ ఫైనల్లోకి దూసుకెళ్లి భారత్ ఖాతాలో మరో పతకం చేర్చేందుకు సిద్ధమయ్యారు. శనివారం నాటి క్వార్టర్ ఫైనల్లో చైనాకు చెందిన వరల్డ్ నంబర్ 2 జోడీ చెన్ మెంగ్, వాంగ్ యిదీలను మట్టికరిపించి వహ్వా అనిపించారు.
అత్యధికంగా షూటింగ్‌లో
ఇక 19వ ఆసియా క్రీడల్లో భారత్ ఇప్పటి వరకు 10 బంగారు, 14 వెండి, 14 కాంస్యాలు మొత్తంగా 38 పతకాలు గెలిచింది. భారత మహిళా క్రికెట్ జట్టుతో పాటు ఈక్వెస్ట్రియన్ డ్రెసాజ్ టీమ్, 10మీ. ఎయిర్ పిస్టల్ టీమ్ మెన్, వ్యక్తిగత విభాగం, 50మీ. రైఫిల్ 3 పొజిషన్స్ టీమ్ మెన్, 10మీ. ఎయిర్ పిస్టల్ వుమెన్, 25మీ. పిస్టల్ టీమ్ వుమెన్, 50మీ. రైఫిల్ 3 పొజిషన్స్ వుమెన్, మెన్స్ స్క్వాష్, టెన్నిస్ మిక్స్‌డ్ డబుల్స్‌లో భారత్ పసిడి పతకాలు గెలిచింది. ఇందులో అత్యధికంగా షూటింగ్‌లో ఆరు గోల్డ్ మెడల్స్ ఉన్నాయి.
చదవండి: WC2023: అతడి ఆట అద్భుతం.. గేమ్ ఛేంజర్ తనే: యువరాజ్ సింగ్
Comments
Please login to add a commentAdd a comment