ఈ వారం థియేటర్, ఓటీటీలోకి వచ్చే సినిమాలివే
కరోనా ప్రభావం తగ్గి ఆడియన్స్ ఇప్పుడిప్పుడే థియేటర్ల వైపు కదులుతున్నారు. దీంతో ఇప్పటికే కొన్ని సినిమాలు థియేటర్స్ విడుదలై మంచి విజయాన్ని సాధించగా, మరికొన్ని విడుదలైయ్యేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నాయి. అలాగే మరి కొన్ని డెరెక్ట్ ఓటీటీ రిలీజ్‌కి, ఇంకొన్ని ఇటీవలే థియేటర్లలో విడుదలై ఇప్పుడు ఓటీటీల్లో ప్రేక్షకులని అలరించేందుకు రెడీగా ఉన్నాయి. ఈ తరుణంలో ఈ వారం ఆడియన్స్ ముందుకు వస్తున్న సినిమాలపై ఓ లుక్ వేయండి.
‘ఉప్పెన’ తర్వాత ‘కొండపొలం’తో వస్తున్న వైష్ణవ్‌తేజ్
వైష్ణవ్‌తేజ్ హీరోగా పరిచయమైన ‘ఉప్పెన’ ఎంత పెద్ద హిట్ అయ్యిందో తెలిసిందే. ఆయన ప్రస్తుతం క్రిష్ దర్శకత్వంలో నటిస్తున్న చిత్రం ‘కొండపొలం’. రకుల్ ప్రీత్ సింగ్ కథనాయికగా నటిస్తోంది. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా అక్టోబరు 8న థియేటర్లలో విడుదలకు సిద్ధమయ్యింది. సన్నపురెడ్డి వెంకటరామిరెడ్డి నవల ‘కొండపొలం’ ఆధారంగా ఈ సినిమా తెరకెక్కింది. ఇప్పటికే విడుదలైన ప్రచార చిత్రాలు సినిమాపై అంచనాలను పెంచాయి. ఎం.ఎం.కీరవాణి సంగీతం అందిస్తున్నారు.
మెడికల్ క్రైమ్ థ్రిల్లర్‌గా ‘వరుణ్ డాక్టర్’
‘రెమో’ సినిమాతో తెలుగులోనూ మంచి ఫాలోయింగ్ సంపాదించుకున్న తమిళ నటుడు శివ కార్తికేయన్. ఇప్పటికే ఆయన నటించిన కొన్ని అనువాద సినిమాలు ప్రేక్షాకదరణని పొందాయి. నీల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో ఆయన హీరోగా చేసిన తాజా చిత్రం ‘వరుణ్ డాక్టర్’. మెడికల్ క్రైమ్ థ్రిల్లర్‌గా వస్తున్న ఈ మూవీలో ప్రియాంక అరుళ్ మోహన్ హీరోయిన్గా నటించింది. షూటింగ్ పూర్తై కోవిడ్ నేపథ్యంలో విడుదల ఆలస్యమైన ఈ సినిమా అక్టోబరు 9న థియేటర్లలో ప్రేక్షకులను పలకరించనుంది.
‘ఆరడుగుల బుల్లెట్’గా రానున్న గోపిచంద్
డైరెక్టర్ బి.గోపాల్ దర్శకత్వంలో గోపీచంద్, నయనతార హీరోహీరోయిన్లుగా చేసిన చిత్రం ‘ఆరడుగుల బుల్లెట్’. జయబాలజీ రీల్ మీడియా ప్రైవేట్ లిమిలెట్ పతాకంపై తాండ్ర రమేశ్ నిర్మించాడు. కొన్నేళ్ల క్రితమే చిత్రీకరణ పూర్తైన ఈ చిత్రం వివిధ కారణాల వల్ల విడుదలకు కాలేదు. ఎట్టకేలకు అక్టోబర్ 8న ఈ మూవీని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నట్లు మూవీ టీం ప్రకటించింది. మణిశర్మ సంగీతం అందించిన ఈ సినిమాలో ప్రకాశ్‌రాజ్, బ్రహ్మానందం కీలకపాత్రలు పోషించారు.
ప్రేమకథ చెబుతానంటున్న నవీన్ చంద్ర
సురేష్ ఉత్తరాది దర్శకత్వం వహిస్తున్న చిత్రం ‘నేను లేని నా ప్రేమకథ’. నవీన్‌చంద్ర కథానాయకుడిగా గాయత్రి ఆర్.సురేష్, అదితి మ్యాకల్ కథానాయికలు చేస్తున్నారు. కల్యాణ్ కందుకూరి, అన్నదాత భాస్కర్‌రావు, నిమ్మకాయల దుర్గాప్రసాద్‌రెడ్డి, నిర్మాతలగా వ్యవహరిస్తున్నారు. అక్టోబరు 8న థియేటర్లలో రిలీజ్ కానున్న ఈ మూవీలోని ప్రేమకథ ప్రతి ఒక్కరికీ కనెక్ట్ అవుతుందని మేకర్స్ ఇటీవల తెలిపారు.
ఓటీటీలో విడులయ్యే చిత్రాలు!
ఓటీటీలో అలరించనున్న శ్రీ విష్ణు
శ్రీ విష్ణు హీరోగా నటించిన చిత్రం ‘రాజ రాజ చోర’. ఇప్పటికే థియేటర్లలో విడుదలై ప్రేక్షకులని అలరించిన ఈ సినిమా ఇప్పుడు అక్టోబరు 8 నుంచి ఓటీటీ ‘జీ 5’లో స్ట్రీమింగ్ కానుంది. హసిత్ గోలి దర్శకత్వం వహించిన ఈ మూవీలో మేఘా ఆకాశ్, సునయన కథానాయికలుగా నటించారు.
‘అంధాదున్’ మలయాళ రీమేక్‌గా వస్తున్న ‘భ్రమమ్’
బాలీవుడ్ హిట్ మూవీ ‘అంధాదున్’ని నితిన్ ‘మ్యాస్ట్రో’గా తెలుగు ప్రేక్షకుల ముందుకు తెచ్చిన విషయం తెలిసిందే. ఇటీవల ఓటీటీలో విడుదలైన ఆ చిత్రం మంచి విజయాన్ని అందుకుంది. అయితే ఈ హిందీ సినిమాని ‘భ్రమమ్’గా మలయాళంలో రిమేక్ చేస్తున్నాడు మలయాళీ స్టార్ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్. రాశిఖన్నా హీరోయిన్గా చేస్తున్న ఈ చిత్రంలో మమతా మోహన్‌దాస్ కీలక పాత్రలో నటిస్తోంది. వినూత్న కథాంశంతో వస్తున్న ఈ మూవీ అక్టోబరు 7 నుంచి ఓటీటీ ఫ్లాట్‌ఫామ్ అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ కానుంది.
పృథ్వీరాజ్ సుకుమారన్ మరో సినిమా ‘కోల్డ్ కేస్’
మలయాళీ నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్ హీరోగా చేసిన మరో చిత్రం ‘కోల్డ్ కేస్’. మిస్టరీ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ చిత్రానికి తను బాలక్ దర్శకుడు. జూన్ 30న మలయాళం భాషలో అమెజాన్ ప్రైమ్‌లో విడుదలైన ఈ సినిమా తెలుగు వెర్షన్ ‘ఆహా’లో అక్టోబరు 8న విడుదల కానుంది.
ఓటీటీలో మరికొన్ని..
నెట్‌ఫ్లిక్స్
హౌస్ ఆఫ్ సీక్రెట్స్- 8 అక్టోబరు
ఎస్కేప్ ది అండర్ టేకర్- 5 అక్టోబరు
డేర్స్ సమవన్ ఇన్సైడ్ యువర్ హౌస్- 6 అక్టోబర్
అమెజాన్ ప్రైమ్
జస్టిన్ బీబర్ ఔర్ వరల్డ్- 8 అక్టోబరు
మాడ్రెస్- 8 అక్టోబరు
సోనీ లివ్
అప్పథావా ఆట్టయా పొట్టుటాంగా- 8 అక్టోబరు
డిస్నీ+హాట్ స్టార్
ముప్పెట్స్ హంటెడ్ మాన్షన్- 8 అక్టోబరు