న్యూఢిల్లీ: ఆసియా క్రీడల్లో భారత ఫుట్‌బాల్ జట్టుకు ఆడే అవకాశం కలి్పంచాలని కోరుతూ సీనియర్ టీమ్ హెడ్ కోచ్ ఐగర్ స్టిమాక్ దేశ ప్రధాని నరేంద్ర మోదీకి విజ్ఞప్తి చేశారు. సెపె్టంబర్ 23 నుంచి చైనాలోని హాంగ్జూలో ఆసియా క్రీడలు జరగనున్నాయి. ఇందులో ఫుట్‌బాల్ క్రీడాంశంలో వివిధ దేశాలకు చెందిన అండర్–23 స్థాయి టీమ్‌లు పాల్గొంటాయి.
ఈ జట్లలో ముగ్గురు సీనియర్ ఆటగాళ్లకు కూడా ఆడే వెసులుబాటు కలి్పస్తారు. అయితే టీమ్ ఈవెంట్లలో ర్యాంకింగ్స్‌లో టాప్–8లో ఉంటేనే మన జట్లను పంపిస్తామని భారత క్రీడా శాఖ మాత్రం విధానం రూపొందించుకుంది. ప్రస్తుతం ఆసియాలో భారత ఫుట్‌బాల్ జట్టు 18వ ర్యాంక్‌లో ఉంది. దాంతో ఫుట్‌బాల్ టీమ్‌ను పంపడానికి అవకాశం లేదు. దీనిపైనే ప్రధాని జోక్యం చేసుకోవాలంటూ స్టిమాక్ సోషల్ మీడియాలో సుదీర్ఘ లేఖ రాస్తూ ప్రత్యేక విజ్ఞప్తి చేశారు. భారత్ 2017లో అండర్–17 ప్రపంచ కప్‌కు ఆతిథ్యమిచ్చింది. నాటి జట్టులో ఆడినవారే ఇప్పుడు అండర్–23 క్వాలిఫయర్స్‌లో మెరుగ్గా రాణించారు.
ఈ కుర్రాళ్లలో మంచి ప్రతిభ ఉంది. కానీ ఇప్పుడు ఆసియా క్రీడల్లో మన జట్టు పాల్గొనకుండా అడ్డు చెబుతున్నారు. ఈ టీమ్‌లో అలాంటి ప్రతిష్టాత్మక ఈవెంట్‌లో పాల్గొనాలి. జట్టును పంపకుండా ఉండేందుకు చెబుతున్న కారణాలు సహేతుకంగా లేవు. అందుకే భారత్ కోచ్‌గా ఈ విషయాన్ని మీ దృష్టికి, కేంద్ర క్రీడాశాఖ దృష్టికి తీసుకొస్తున్నాను. కాబట్టి మీరు జోక్యం చేసుకొని జట్టు ఆసియా క్రీడల్లో పాల్గొనేలా చేయాలి అని స్టిమాక్ అన్నారు. ఎలాంటి ప్రత్యర్థినైనా ఓడించే సత్తా మన జట్టుకు ఉందని ఆయన అభిప్రాయ పడ్డారు. ‘ర్యాంకింగ్ పేరు చెప్పి మన క్రీడా శాఖనే జట్టు పాల్గొనకుండా చేస్తోంది.
నిజానికి ఆసియా క్రీడల్లో పాల్గొంటున్న కొన్ని ఇతర క్రీడల టీమ్‌ల కంటే మన ఫుట్‌బాల్ జట్టు ర్యాంక్ మెరుగ్గానే ఉంది. పైగా తమకంటే బలమైన జట్లపై చిన్న టీమ్‌లు సంచలన విజయాలు సాధించడం ఫుట్‌బాల్‌లో అసాధ్యమేమీ కాదని చరిత్ర చెబుతోంది’ అని స్టిమాక్ అభిప్రాయపడ్డారు. ఇటీవల ఫ్రాన్స్ పర్యటనలో భాగంగా అక్కడి స్టార్ ఆటగాడు కిలియాన్ ఎంబాపె భారత్‌లో సూపర్‌హిట్ అని, అతనికి అక్కడికంటే మన దేశంలోనే ఎక్కువ మంది అభిమానులు ఉన్నారని నరేంద్ర మోదీ చెప్పిన విషయాన్ని స్టిమాక్ గుర్తు చేశారు.
‘ఫ్రాన్స్ పర్యటనలో ఎంబాపె గురించి మీరు చేసిన వ్యాఖ్య భారత ఫుట్‌బాల్‌ను అభిమానించేవారందరికీ సంతోషం కలిగించింది. మన జట్టు ఆసియా క్రీడల్లో పాల్గొనేలా చూడాలని భారత టీమ్ తరఫున మిమ్మల్ని కోరుతున్నా. క్రీడాశాఖ సూచనల్లో ఒక ప్రత్యేక నిబంధన కూడా ఉంది. టాప్–8లో లేకపోయినా సరైన కారణంతో నిపుణుల బృందం సిఫారసు చేస్తే ఆ టీమ్‌ను ఆసియా క్రీడలకు పంపవచ్చు. దీని ప్రకారం అవకాశం కలి్పంచండి’ అని స్టిమాక్ కోరారు. భారత ఫుట్‌బాల్ జట్టు 1951 న్యూఢిల్లీ, 1962 జకార్తా ఆసియా క్రీడల్లో స్వర్ణ పతకాలు... 1970 బ్యాంకాక్ ఆసియా క్రీడల్లో కాంస్య పతకం సాధించింది. ఆ తర్వాత పలుమార్లు భారత జట్టు ఆసియా క్రీడల్లో పాల్గొన్నా ఆరంభ రౌండ్లలోనే ని్రష్కమించింది.
Comments
Please login to add a commentAdd a comment