
ఖాళీగా ఉన్న భారత సీనియర్ పురుషుల హెడ్ కోచ్ పదవి కోసం 291 మంది దరఖాస్తు చేసుకున్నారు. ఈ జాబితాలో భారత జట్టు మాజీ సభ్యుడు, గతంలో మోహన్ బగాన్ క్లబ్, ఈస్ట్ బెంగాల్ క్లబ్ జట్లకు కోచ్‌గా ఉన్న స్టాన్లీ రొజారియో... నార్త్ ఈస్ట్ యునైటెడ్ క్లబ్ అసిస్టెంట్ కోచ్ నౌషాద్ మూసా కూడా ఉన్నారు.
64 ఏళ్ల రొజారియో సరీ్వసెస్‌తో తన కోచింగ్ కెరీర్‌ను మొదలుపెట్టి 2006 నుంచి 2008 వరకు టీమిండియాకు అసిస్టెంట్ కోచ్‌గా వ్యవహరించారు. ఈ నెలాఖరుకు కొత్త కోచ్‌ను నియమిస్తారు.