న్యూఢిల్లీ: భారత ఫుట్‌బాల్ జట్టుకు భవిష్యత్తులో స్వదేశీ కోచ్ ఉంటేనే బాగుంటుందని భారత జట్టు కొత్త హెడ్ కోచ్ మనొలొ మార్క్వెజ్ అభిప్రాయపడ్డారు. ఇగోర్ స్టిమాక్ స్థానంలో స్పెయిన్‌కు చెందిన 55 ఏళ్ల మార్క్వెజ్‌ను ఇటీవల హెడ్ కోచ్‌గా నియమించారు. ఆదివారం మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ‘స్పెయిన్ తర్వాత ఎక్కువగా గడిపింది భారత్‌లోనే. అందుకేనేమో కొన్నేళ్ల క్రితం భారత్‌కు హెడ్ కోచ్ కావాలని గట్టిగా అనుకున్నాను. అది అప్పుడు కల. కానీ ఇప్పుడు ఆ కల నిజమైనందుకు ఆనందంగా ఉంది’ అని అన్నారు.
అయితే భారత్ భిన్న రాష్ట్రాల సమ్మిళితం కాబట్టి స్వదేశీ కోచ్ ఉంటేనే బాగుంటుందని, స్థానిక భాషలు, అంశాలపై ఆయనకు పట్టు ఉంటుందని మార్క్వెజ్ వివరించారు. ‘భారత్ కోచ్‌గా జట్టు స్థాయి పెంచడమే మా లక్ష్యం. వ్యక్తిగతంగా ఆటగాళ్లు, సమష్టిగా జట్టు మెరుగయ్యేందుకు ప్రణాళికలు రచిస్తాం. ఇప్పటికిప్పుడు దీని ఫలితాలు రాకపోవచ్చు. దీనికి కొంత సమయం పడుతుంది. ప్రస్తుత లక్ష్యమైతే ఆసియా కప్–2027కు అర్హత సాధించడం. ఆసియా కప్ క్వాలిఫయర్స్‌కు ముందు భారత్ ఆరేడు అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడుతుంది’ అని అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment