ప్రియుడితో నటి నిశ్చితార్థం | Kamya Panjabi Shares Engagement See Pics | Sakshi
Sakshi News home page

ఎంగేజ్‌మెంట్‌ అయ్యింది: నటి

Published Mon, Feb 10 2020 5:13 PM | Last Updated on Mon, Feb 10 2020 5:28 PM

Kamya Panjabi Shares Engagement See Pics - Sakshi

ముంబై: హిందీ టెలివిజన్‌ రంగంలో ప్రత్యేక గుర్తింపు దక్కించుకున్న సీనియర్‌ నటి కామ్యా పంజాబీ(40) త్వరలోనే పెళ్లిపీటలు ఎక్కబోతున్నారు. తన ప్రియుడు షలభ్‌ దాంగ్‌ను ఆమె వివాహమాడనున్నారు. ఈ క్రమంలో శనివారం కామ్యా- షలభ్‌ల నిశ్చితార్థం అత్యంత సన్నిహితుల మధ్య నిరాడంబరంగా జరిగింది. గురుద్వారలో శనివారం వీరిద్దరు ఉంగరాలు మార్చుకున్నారు. నలుపు- బంగారు వర్ణాలతో కూడిన డ్రెస్సులో కామ్యా మెరిసిపోగా.. షలభ్‌ నీలి రంగు కుర్తాలో హుందాగా కనిపించారు. కాగా ఈ వేడుకకు సంబంధించిన ఫొటోలు, వీడియోలను కామ్యా తన ఇన్‌స్టా అకౌంట్‌లో షేర్‌ చేశారు. దీంతో ఈ జంటకు సోషల్‌ మీడియా వేదికగా శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి.

అంగరంగ వైభవంగా నిఖిల్‌గౌడ నిశ్చితార్థం  

కాగా కామ్యాకు గతంలో బంటీ నేగీ అనే వ్యాపారవేత్తతో వివాహం జరిగింది. ఇరువురి మధ్య భేదాభిప్రాయాలు తలెత్తడంతో 2013లో వాళ్లిద్దరూ విడిపోయారు. వీరికి పాప ఆరా(10) కూడా ఉంది. తను కూడా తన తల్లి నిశ్చితార్థ వేడుకలో సందడి చేసింది. ఇక పలు సీరియల్స్‌లో అత్త, అమ్మ పాత్రల్లో నటిస్తున్న కామ్యా.. హిందీ బిగ్‌బాస్‌ సీజన్‌ 7లో కూడా పాల్గొని పాపులర్‌ అయ్యారు. ప్రస్తుతం.. సమాజంలో గుర్తింపు కోసం హిజ్రాలు చేసే పోరాటం నేపథ్యంలో ప్రముఖ హిందీ చానెల్‌లో ప్రసారమవుతున్న ‘శక్తి’ సీరియల్‌లో హీరోయిన్‌ అత్త పాత్రను పోషిస్తున్నారు. ఇక కామ్యాకు కాబోయే భర్త వైద్యరంగానికి చెందినవాడు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement