
ప్రతి జంట తమ పెళ్లి జీవితాంతం గుర్తుండిపోయేలా ప్రత్యేకంగా ఉండాలని కోరుకుంటారు. అలాగే వారు కూడా ప్రత్యేక ఆకర్షణగా నిలవాలని అనుకుంటారు. ఇటువంటి సన్నివేశానికి సంబంధించిన ఒక వీడియో ప్రస్తుతం సోషల్ మీడియోలో వైరల్ అవుతుంది. ఈ వీడియోలో వధువు వివాహ వేడుక ప్రారంభమయ్యే ముందు వరుడిని ఆశ్చర్యపరచాలని నిర్ణయించుకుంది. దీనిలో భాగంగా వరుడు వివాహ వేదికపై బంధుమిత్రులతో కలిసి ఉన్నాడు. వరుడు, స్నేహితులు, కుటుంబ సభ్యులు వధువు కోసం ఆత్రంగా ఎదురు చూస్తున్నారు.
ఇంతలో పెళ్లి మండపం వద్దకు వస్తున్న వధువును కొంతమంది అమ్మాయిలు దుపట్ట అడ్డుపెట్టి కవర్ చేశారు. ఇక వధువును వెంటనే చూడడానికి వీలు లేకుండా వరుడి ముందు కొన్ని పరదాలు వరుసగా ఉంచారు. పెళ్లి కూతురు పెళ్లి కొడుకును సమీపిస్తున్న కొద్దీ ఒక్కో పరదాను తొలగించారు. అలా అన్ని దుపట్టాలు తొలగిపోగా.. ఆ నవ వధువు అందమైన లెహంగాలో దర్శనమిచ్చింది. ఆమెను చూసిన వరుడు ఒక్కసారిగా సంభ్రమాశ్చర్యాలకు లోనయ్యాడు. పెళ్లి కూతురు కళ్లల్లోకి చూసి ముసిముసిగా నవ్వుకున్నాడు. ఎందుకంటే.. అతనికి ఎంతో ఇష్టమైన లెహంగాను వధువు ధరించడమే దీనంతటికీ కారణం. ఈ సన్నివేశానికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Comments
Please login to add a commentAdd a comment