జనగాం అబ్బాయి... అమెరికా అమ్మాయి | janagam boy marries american national in hyderabad | Sakshi
Sakshi News home page

జనగాం అబ్బాయి... అమెరికా అమ్మాయి

Published Thu, Dec 8 2016 7:21 PM | Last Updated on Mon, Sep 4 2017 10:14 PM

జనగాం అబ్బాయి... అమెరికా అమ్మాయి

జనగాం అబ్బాయి... అమెరికా అమ్మాయి

హైదరాబాద్: జనగాం జిల్లాకు చెందిన ఓ యువకుడు హిందూ సంప్రదాయం ప్రకారం అమెరికా యువతిని వివాహం చేసుకున్నారు. గురువారం జరిగిన ఈ వేడుకకు నాగోలులోని నిమంత్రన్ ఫంక్షన్ హాల్ వేదికైంది. లింగాలఘణపురం మండలం వనపర్తి గ్రామానికి చెందిన వంచ పద్మారెడ్డి, అవనిజల కుమారుడు అవినిష్ రెడ్డి పెద్ద చదువుల కోసం అమెరికా వెళ్లాడు. 
 
చదువు పూర్తైన తర్వాత అక్కడే ఓ సాఫ్ట్ వేర్ కంపెనీలో ఉద్యోగంలో చేరాడు. అమెరికాలో వెంటినా ప్రాంతంలో నివసించే అవినిష్.. అదే ప్రాంతానికి చెందిన ఎరిడాని ఏంజిల్స్ తో పరిచయం ఏర్పడింది. పరిచయం కాస్తా ప్రేమగా మారడంతో ఇరువురు కుటుంబసభ్యులకు తమ విషయం చెప్పి ఒప్పించారు. వధువు పేరు అనవిగా మార్చిన వరుడి కుటుంబసభ్యులు గురువారం వీరి వైభవంగా వివాహం చేశారు. వరుడి తల్లిదండ్రులే కన్యాదానం కూడా చేశారు. ఈ వివాహానికి వధువు తరఫు కుటుంబసభ్యులు కూడా పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement