
రాజు మృతదేహం
నందికొట్కూరు (కర్నూలు): వివాహ నిశ్చితార్థంలో లడ్డూ కోసం తాగుబోతులు వీరంగం సృష్టించిన ఘట నలో పెళ్లి కుమార్తె సొంత అన్న మృతి చెందాడు. ఈ ఘటన నందికొట్కూరులో సోమవారం అర్ధరాత్రి చోటుచేసుకుంది. పోలీసుల కథనంమేరకు.. కొత్తపల్లి మండలం ఎదురుపాడుకు చెందిన మరియమ్మ, ఏసన్న దంపతుల కుమార్తెకు పాములపాడు మండలం మిట్టకందాలకు చెందిన దిబ్బన్న కుమారుడు ప్రశాంత్‌తో సోమవారం నందికొట్కూరులో వివాహ నిశ్చితార్థం జరిగింది.
రాత్రి 12 గంటలకు భోజనాలు వడ్డిస్తున్న జంబులయ్యతో అదనంగా లడ్డూ ఇవ్వాలని తప్ప తాగిన మైకంలో ఉన్న చెన్నయ్య, ఆంజనేయులు గొడవ పడ్డారు. పెళ్లి కుమార్తె సొంత అన్నయ్య కుమార్ అలియాస్ రాజు వారికి సర్దిచెప్పేందుకు వెళ్లాడు. అతనిపై చెన్నయ్య, ఆంజనేయులుతో పాటు సుజాత, మరికొందరు కలిసి దాడి చేయడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ మేరకు తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కుమార్‌కు భార్య, కూతురు, కుమారుడు ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment