సంఘవి రీ ఎంట్రీ | Heroine Sanghavi re entry in movies | Sakshi
Sakshi News home page

సంఘవి రీ ఎంట్రీ

Published Sun, Apr 19 2015 2:01 AM | Last Updated on Wed, Sep 18 2019 2:56 PM

సంఘవి రీ ఎంట్రీ - Sakshi

సంఘవి రీ ఎంట్రీ

బహుభాషా నటీమణుల్లో సంఘవి ఒకరు. తమిళం, తెలుగు భాషల్లో ప్రముఖ హీరోలందరితోను జత కట్టారు. ఇళయదళపతి విజయ్, అజిత్ కెరీర్ తొలిరోజుల్లో సంఘవినే వారి హీరోయిన్. విజయ్‌తో కోయంబత్తూరు మాప్పిళ్లై తదితర చిత్రాలలో నటించారు. ఒకప్పుడు ప్రముఖ హీరోయిన్‌గా రాణించిన ఈమె మధ్యలో కొంతకాలం సినిమాకు దూరం అయ్యారు. కారణాలేమైనా రీఎంట్రీ అవుతున్న జాబితాలో తాజాగా సంఘవి చేరారు. ఈమె ఇప్పుడు దర్శకుడు సముద్రకణికి జంటగా నటించడానికి సిద్ధమయ్యారు. దర్శకుడు నలన్ దర్శకత్వం వహిస్తున్న చిత్రం కొలంజి.
 
  రాజాజీ, సముద్రకని ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రం నగర నేపథ్యంలో సాగే విభిన్న ప్రేమకథా చిత్రం అని దర్శకుడు తెలిపారు. సముద్రకణి సరసన సంఘవి జంటగా నటిస్తున్నారని చెప్పారు. వీరివి ఈ చిత్రంలో చాలా కీలక పాత్రలని అన్నారు. రాజాజీకు జంటగా నవ నటి నటిస్తున్నారని తెలిపారు. ఇది నగర జీవితంలో జరిగే విభిన్న ప్రేమకథా చిత్రం అని వివరించారు. చిత్రం కోసం రెండు పాటలను కొన్ని సన్నివేశాల్ని చిత్రీకరించినట్లు దర్శకుడు నలన్ వెల్లడించారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement