సీనియర్ హీరోయిన్ రీ ఎంట్రీ | sanghavi re entry in telugu movies | Sakshi
Sakshi News home page

సీనియర్ హీరోయిన్ రీ ఎంట్రీ

Published Tue, Jun 7 2016 3:06 PM | Last Updated on Wed, Sep 18 2019 2:52 PM

సీనియర్ హీరోయిన్ రీ ఎంట్రీ - Sakshi

సీనియర్ హీరోయిన్ రీ ఎంట్రీ

శ్రీకాంత్ హీరోగా తెరకెక్కిన తాజ్మహల్ సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన కన్నడ భామ సంఘవి. తరువాత సింధూరం, సూర్యవంశం, సమరసింహారెడ్డి, సీతారామరాజు లాంటి సినిమాలతో స్టార్ హీరోయిన్గా గుర్తింపు తెచ్చుకుంది. తెలుగుతో పాటు తమిళ, కన్నడ భాషల్లో కూడా నటించిన సంఘవి, సౌత్ స్టార్ హీరోలందరితోనూ కలిసి నటించింది.

2010 తరువాత సినిమాలకు దూరమైన ఈ భామ, ఇప్పుడు రీ ఎంట్రీకి రెడీ అవుతోంది. ఈ ఏడాది ఫిబ్రవరి పెళ్లి చేసుకొని ఫ్యామిలీ లైఫ్ లోకి అడుగు పెట్టిన ఈ భామ మరోసారి వెండితెర మీద అదృష్టాన్ని పరీక్షించుకోనుంది. ఇప్పటికే రెండు తమిళ సినిమాలను అంగీకరించిన సంఘవి, తాజాగా తెలుగు సినిమాల మీద దృష్టి పెట్టింది. ప్రస్తుతం టాలీవుడ్లో గ్లామరస్ అత్త, అమ్మ పాత్రలకు మంచి డిమాండ్ ఉండటంతో తన వయసుకు తగ్గ పాత్ర కోసం దర్శకనిర్మాతలను సంప్రదిస్తోంది. మరి రీ ఎంట్రీలో ఈ భామ ఎంత వరకు ఆకట్టుకుంటుందో చూడాలి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement