నటి సంఘవి పెళ్లి చేసుకోబోతోంది! | actor sanghavi is tying knot at bangalure | Sakshi
Sakshi News home page

నటి సంఘవి పెళ్లి చేసుకోబోతోంది!

Published Tue, Feb 2 2016 10:05 PM | Last Updated on Tue, Aug 28 2018 4:30 PM

నటి సంఘవి పెళ్లి చేసుకోబోతోంది! - Sakshi

నటి సంఘవి పెళ్లి చేసుకోబోతోంది!

తమిళ సినిమా (చెన్నై): ఒకప్పటి ప్రముఖ హీరోయిన్ సంఘవి బుధవారం వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టబోతున్నది. కర్ణాటకకు చెందిన సంఘవి ఐటీ సంస్థ అధినేత ఎన్ వెంకటేశ్‌ను బుధవారం పెళ్లి చేసుకోబోతున్నది. వీరి వివాహం ఉదయం 9 గంటలకు బెంగళూరు ఎంజీ రోడ్డులోని వివాంత తాజ్ హోటల్‌లో జరుగనుంది. ఉదయం 11 గంటలకు రిసెప్షన్ నిర్వహించనున్నారు. సంఘవి కన్నడ అమ్మాయి కాగా, వెంకటేశ్ మలయాళీ.

సంఘవి అసలు పేరు కావ్యా రమేష్. ఆమె మొదట తమిళంలో అజిత్‌కు జంటగా 'అమరావతి' సినిమా ద్వారా చిత్రసీమకు పరిచయమైంది. ఆ తరువాత విజయ్, కార్తీక్ తదితర ప్రముఖ తమిళ  హీరోలతో నటించారు. రజనీకాంత్ 'బాబా' చిత్రంలోనూ కనిపించింది. దక్షిణాది భాషలన్నింటిలోనూ సంఘవి నాయికగా నటించింది. తెలుగులో నాగార్జున, రాజశేఖర్ వంటి ప్రముఖ హీరోలతో జతకట్టి.. అనేక సినిమాల్లో అభిమానులను మెప్పించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement