Actress Trisha Opens Up About Her Marriage Plans - Sakshi
Sakshi News home page

Trisha : 40 ఏళ్ల వయసులో పెళ్లిపై దృష్టి పెట్టిన త్రిష..

Published Sun, Aug 20 2023 6:42 AM | Last Updated on Sun, Aug 20 2023 12:18 PM

Trisha Get Marriage Plan - Sakshi

తెలుగు, తమిళ భాషల్లో అగ్ర కథానాయికగా ఇప్పటికీ వరుస సినిమాలతో సౌత్‌ ఇండియాలో సందడి చేస్తున్న నటి త్రిష. వయసు పెరుగుతున్న కొద్దీ తరగని అందంతో యువతను మంత్రముగ్ధులను చేస్తోంది. ఆమె కీలక పాత్రలో నటించిన 'పొన్నియిన్‌ సెల్వన్‌' నుంచి వచ్చిన రెండు భాగాలు కూడా  ప్రేక్షకులను అలరించాయి. మొదట 'లేస.. లేసా' అనే తమిళ చిత్రంతో కథానాయకిగా పరిచయమైన ఈ సంచలన నటి  అక్కడ 'సామి' చిత్రంతో కమర్షియల్‌ సినిమాల హీరోయిన్‌ లిస్టులో చేరిపోయారు.

(ఇదీ చదవండి: మాపై ట్రోల్స్‌ చేస్తుంది ఆ 'స్నేక్‌' బ్యాచ్‌నే: మంచు విష్ణు)

ఆ తర్వాత వరుసగా సౌత్‌ ఇండియా అన్ని భాషల్లో నటిస్తూ అగ్ర నటి స్థాయికి ఎదిగారు. అలా 20 ఏళ్ల తన నట ప్రస్థానం దిగ్విజయంగా కొనసాగుతోంది. మణిరత్నం దర్శకత్వంలో  'పొన్నియిన్‌ సెల్వన్‌'లో యువరాణి కుందవైగా కనిపించి మరోసారి తన సత్తాను చాటిన త్రిష సమీప కాలంలో తన 40వ పుట్టినరోజు వేడుకలను స్నేహితులతో కలిసి ఘనంగా జరుపుకున్నారు . కాగా నటిగా కెరియర్‌ సక్సెస్‌ బాటలో పయనిస్తున్న వ్యక్తిగత జీవితం మాత్రం ఇప్పటికీ ఆమెను త్రిషపై ప్రేమ వదంతులు చాలానే దొర్లుతున్నాయి. ఒకసారి ఈమె పెళ్లి విషయంలో నిశ్చితార్థం వరకు వెళ్లి ఆపై ముందుకు సాగలేదు.

ఇదీ చదవండి: చిరంజీవిని అలా అంటుంటే చాలా బాధగా ఉంది: ప్రముఖ హీరో)

ఇటీవల ఒక భేటీలో ఈమె పెళ్లి బంధంపై స్పందిస్తూ తన స్నేహితులు కొందరు పెళ్లి చేసుకుని కొద్ది ఏళ్లకే విడాకులు గురించి మాట్లాడుకోవడం తన చెవికి చేరిందన్నారు. అందుకే తనతో జీవితాంతం సంతోషంగా కలిసి పయనించే వ్యక్తి తారసపడితేనే పెళ్లి చేసుకోవాలి అని నిర్ణయించుకున్నట్లు పేర్కొన్నారు. కాగా త్రిష ఇటీవల తన ఇన్‌ స్ట్రాగామ్‌లో వరుసగా తాను పెళ్లి దుస్తుల్లో ఉన్న ఫొటోలను పోస్ట్‌ చేస్తున్నారు. దీంతో ఆమెకు పెళ్లిపై దృష్టి మళ్లినట్లుందా..? అంటూ నెటిజన్లు ఆట పట్టిస్తున్నారు. కాగా ప్రస్తుతం త్రిష నటుడు విజయ్‌ సరసన లియో చిత్రంలో నటించారు. సుమారు 14 ఏళ్ల తర్వాత విజయ్‌, త్రిష కలిసి నటించిన చిత్రం ఇది. తాజాగా అజిత్‌తో విడాముయిర్చి చిత్రంలో నటించడానికి సిద్ధమవుతున్నట్లు సమాచారం.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement