దళపతితో పాటు ఫోటోలో ఉన్న అబ్బాయి ఎవరో తెలుసా? | Actor Thalapathy Vijay Meet With Star Heroine Family Pics Goes Viral | Sakshi
Sakshi News home page

Thalapathy Vijay: దళపతి విజయ్‌ ఎత్తుకున్న కుర్రాడు ఎవరంటే?

Published Wed, Jul 17 2024 2:39 PM | Last Updated on Wed, Jul 17 2024 3:16 PM

Actor Thalapathy Vijay Meet With Star Heroine Family Pics Goes Viral

దళపతి విజయ్ ప్రస్తుతం గోట్‌(ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్) చిత్రంతో బిజీగా ఉన్నారు. వెంకట్‌ ప్రభు డైరెక్షన్‌లో తెరకెక్కిస్తోన్న ఈ చిత్రంలో మీనాక్షి చౌదరి హీరోయిన్‌గా నటిస్తోంది. లియో సూపర్ హిట్ తర్వాత విజయ్ నటిస్తోన్న మూవీ కావడంతో అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇటీవలే ఈ మూవీ నుంచి విజిలేస్కో అంటూ సాగే సాంగ్‌ను మేకర్స్ రిలీజ్‌ చేశారు. ఈ పాటకు ఆడియన్స్‌ నుంచి అదిరిపోయే రెస్పాన్స్ వస్తోంది.

అయితే విజయ్ మూవీ షూటింగ్‌ ప్రస్తుతంలో కెనడాలో జరుగుతున్నట్లు తెలుస్తోంది. ఈ సందర్భంగా విజయ్‌ ప్రముఖ టాలీవుడ్ హీరోయిన్‌ రంభను కలిశారు. ఆమె తన కుటుంబంతో కలిసి విజయ్‌తో దిగిన ఫోటోలను తాజాగా ట్విటర్‌లో పంచుకున్నారు. చాలా ఏళ్ల తర్వాత నాకు ఇష్టమైన హీరోను కలిశానంటూ రంభ పోస్ట్ చేసింది. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరలవుతున్నాయి. 
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement