వివాహిత అనుమానాస్పద స్థితిలో మృతిచెందిన సంఘటన విశాఖ జిల్లా డుంబ్రిగూడ మండలం నందివలస గ్రామంలో గురువారం చోటుచేసుకుంది.
వివాహిత అనుమానాస్పద స్థితిలో మృతిచెందిన సంఘటన విశాఖ జిల్లా డుంబ్రిగూడ మండలం నందివలస గ్రామంలో గురువారం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన రంభ(32) అనుమానాస్పద స్థితిలో మృతిచెందడాన్ని గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. రంగంలోకి దిగిన పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించి దర్యాప్తు చేస్తున్నారు. కాగా.. ఆమె భర్త మాత్రం పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకుందని అంటుండగా.. కుటుంబ సభ్యులు మాత్రం అతడే హత్య చేసి ఆత్మహత్యలా చిత్రించడానికి యత్నిస్తున్నాడని ఆరోపిస్తున్నారు.