రంభ గురించి అలాంటి ప్రచారం చేయొద్దు : కుష్బూ | Rambha denies divorce rumours | Sakshi
Sakshi News home page

రంభ గురించి అలాంటి ప్రచారం చేయొద్దు : కుష్బూ

Published Thu, Jul 3 2014 11:50 PM | Last Updated on Fri, Sep 28 2018 4:32 PM

రంభ గురించి అలాంటి ప్రచారం చేయొద్దు : కుష్బూ - Sakshi

రంభ గురించి అలాంటి ప్రచారం చేయొద్దు : కుష్బూ

 గాసిప్పురాయుళ్లను నోరుమూసుకోమని చెబుతున్నారు కుష్బూ. అంత మాట అన్నారంటే, కుష్బూ గురించి చేయకూడని ప్రచారం ఏదో చేసే ఉంటారని ఊహించవచ్చు. కానీ, కుష్బూ ఈ విధంగా స్పందించింది తనకోసం కాదు.. రంభ కోసం. కెనడాకు చెందిన వ్యాపారవేత్త ఇంద్రకుమరన్‌ని రంభ పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. వీళ్లకో పాప ఉంది. పేరు ‘లాన్య’. పెళ్లయినప్పట్నుంచీ కెనడాలోనే ఉంటున్నారు రంభ. నటిగా సెకండ్ ఇన్నింగ్స్ ఆరంభించడానికి ఆమె ఇండియా రానున్నారని, నిర్మాతగా కూడా మారనున్నారని అడపా దడపా వార్తలు వినిపిస్తున్నాయి. కానీ, ఇటీవల మాత్రం తన భర్త నుంచి రంభ విడాకులు తీసుకోనున్నారనే వార్త ప్రచారంలో ఉంది.
 
 ఈ విషయం గురించే కుష్బూ ఘాటుగా స్పందించారు. ఇటీవల ఆమె కెనడా వెళ్లారు. కుష్బూ అక్కడికొచ్చిన విషయం తెలుసుకుని రంభ తన ఇంటికి ఆహ్వానించడం, ఈమె వెళ్లడం జరిగింది. రంభతో కబుర్లు చెప్పడంతో పాటు ఆమె కూతురు లాన్యని కూడా ముద్దు చేశారు కుష్బూ. అది మాత్రమే కాదు నయాగరా జలపాతాలను వీక్షించాలనుకున్న కుష్బూతో కలిసి రంభ, ఆమె భర్త కూడా వెళ్లారు. అక్కడ బాగా ఎంజాయ్ చేశామని కుష్బూ పేర్కొన్నారు. రంభ, ఇంద్రకుమరన్‌ని చూస్తే, చాలా ముచ్చటేసిందని ఇద్దరూ చాలా అన్యోన్యంగా ఉన్నారని కుష్బూ చెప్పారు. ఈ దంపతుల మధ్య మనస్పర్థలు ఉన్నాయంటూ కొంతమంది ప్రచారం చేస్తున్నారని, అందులో నిజం లేదని ట్విట్టర్ ద్వారా స్పష్టం చేశారామె.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement