స్ట్రాబెర్రీ అంత తియ్యగా... | Rambha Shares Her New Born Baby Boy Shivin's Photo | Sakshi
Sakshi News home page

స్ట్రాబెర్రీ అంత తియ్యగా...

Published Fri, Nov 9 2018 1:45 AM | Last Updated on Fri, Nov 9 2018 1:45 AM

Rambha Shares Her New Born Baby Boy Shivin's Photo - Sakshi

రంభ, శివిన్‌

‘బావగారు బాగున్నారా, బొంబాయి ప్రియుడు, గణేశ్‌’ వంటి చిత్రాలతో అలరించిన రంభను అంత సులువుగా మరచిపోలేం. ఇంద్రకుమార్‌ పద్మనాధన్‌ అనే బిజినెస్‌మ్యాన్‌ని వివాహం చేసుకున్న తర్వాత సినిమాలకు దూరంగా ఉంటున్నారామె. 2008 తర్వాత తెలుగు సినిమాలు చేయకపోయినా టీవీ షోస్‌ చేస్తున్నారు.  ఈ జంటకు ఆల్రెడీ  సాషా, లాన్య అనే ఇద్దరు అమ్మాయిలు ఉన్నారు. ఈ సెప్టెంబర్‌లో రంభ ఒక బాబుకు జన్మనిచ్చిన సంగతి తెలిసిందే.

ఆ బాబుకు ‘శివిన్‌’ అని నామకరణం చేశారు. తాజాగా ఆ బాబు ఫొటోలను పంచుకున్నారు రంభ. ‘‘శివిన్‌ని చేతిలోకి తీసుకోగానే చిన్న పంచదార బ్యాగ్‌ కంటే ఇంకా చిన్నగా ఉన్నాడు. పసిపిల్లలు ఎంత సుకుమారంగా, ఎంత స్ఫూర్తిదాయకంగా ఉంటారో అనిపిస్తుంది. వేసవిలో కాచే స్ట్రాబెర్రీలా మా అబ్బాయి నవ్వు ఎంత తీయగా ఉందో.. నేను ఊహించినదానికంటే తన కళ్లు ఎంత మెరుస్తున్నాయో’’ అని మురిసిపోయారు రంభ. అంతేకాదు...  ‘‘నేను బతికి ఉన్నంత కాలం వాడిని సంరక్షిస్తూనే ఉంటాను. నా పిల్లల మీద ప్రేమ ఎప్పటికీ తగ్గదు’’ అని తల్లి తాలూకు ఉద్వేగాన్ని కూడా పంచుకున్నారు రంభ.
∙రంభ, శివిన్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement