
Hey Rambha Rambha Song In Maha Samudram: శర్వానంద్, సిద్దార్థ్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం "మహా సముద్రం". 'ఆర్‌ఎక్స్ 100' ఫేమ్ అజయ్ భూపతి దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రంలో అదితీరావు హైదరి, అనూ ఇమ్మాన్యుయేల్ హీరోయిన్లు. సుంకర రామబ్రహ్మం నిర్మాత. జూలై 9న షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం నుంచి తాజాగా హే రంభ పాట రిలీజైంది. రంభ మాయలో పడిపోయిన జగపతిబాబు, శర్వానంద్ మందేసి చిందేస్తున్నారు.
అందాల రంభకు వీరాభిమానులమంటూ రచ్చ రచ్చ చేస్తున్నారు. పూటుగా తాగుతూ 'హే రంభ.. హే రంభ' అని ఆమె జపమే చేస్తున్నారు. భాస్కరభట్ల లిరిక్స్ అందించిన ఈ పాటను చైతన్ భరద్వాజ్ ఆలపించాడు. వైజాగ్ బీచ్‌లో ఈ సాంగ్ చిత్రీకరణ జరిపినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ పాట యూట్యూబ్‌లో మార్మోగిపోతోంది. మరి మీరు కూడా ఓసారి ఈ పాటను వినేయండి..
Comments
Please login to add a commentAdd a comment