
న్యాయనిర్ణేతగా మాస్ మహారాణి
అందాల రాణి రంభ సిల్వర్ స్క్రీన్ మీద చిందులేసినంత కాలం కురక్రారు కంటి మీద కునుకు లేదు. ఆమె అందానికి అందరూ దాసోహమన్నారు. స్టెప్పుల్లో, స్పీడ్‌లో రంభ స్టైలే వేరు. హీరోరుున్‌గానే కాకుండా డ్యాన్‌స లోనూ కొత్త ఒరవడి సృష్టించిన రంభ... ఇప్పుడు తమ టాలెంట్‌ను నిరూపించుకోవాలనుకొనే వారికి వేదిక కాబోతున్న ‘ఏబీసీడీ’ ప్రోగ్రామ్‌కు న్యాయ నిర్ణేతగా వ్యవహరించనున్నట్లు జీ తెలుగు ప్రతినిధి గురు వారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు.
కాగా అవకాశాలు తగ్గింతే చాలామంది నటీమణులు బుల్లితెరకు షిప్ట్ అవుతున్న విషయం తెలిసిందే. సీరియల్స్ లో నటించడంతో పాటు, డాన్స్ షోలకు న్యాయ నిర్ణేతలుగా వ్యవహరిస్తున్నారు కూడా. 'జయం' చిత్రంలో తెలుగు తెరకు పరిచయం అయిన సదా...'ఢీ' జోడీ కార్యక్రమానికి జడ్జిగా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. పెళ్లి తర్వాత నటనకు దూరంగా ఉన్న రంభ తాజాగా 'ఏబీసీడీ' కి న్యాయ నిర్ణేతగా వ్యవహరించడం విశేషం.