పౌరసత్వ వివాదం: అక్షయ్‌ షాకింగ్‌ వీడియో! | Old Clip of Akshay Kumar Saying 'Toronto is My Home' Goes Viral | Sakshi
Sakshi News home page

పౌరసత్వ వివాదం: అక్షయ్‌ షాకింగ్‌ వీడియో!

Published Sat, May 4 2019 10:44 AM | Last Updated on Fri, Mar 22 2024 10:40 AM

ఎట్టకేలకు పౌరసత్వ వివాదంపై అక్షయ్‌కుమార్‌ స్పందించారు. తనకు కెనడా పాస్‌పోర్టు ఉన్న మాట వాస్తవమేనని అంగీకరించిన ఆయన.. అదే సమయంలో మాతృదేశమైన భారత్‌ అంటే తనకు ఎనలేని మక్కువ అని పేర్కొన్నారు. కెనడా పౌరసత్వం విషయంలో అనవసర రాద్ధాంతం చేస్తున్నారని, గత ఏడేళ్లలో తాను ఎన్నడూ కెనడా వెళ్లలేదని, ఇక్కడే ఉంటూ.. ఇక్కడే అన్ని రకాల పన్నులు చెల్లిస్తున్నానని ఆయన స్పష్టం చేశారు.అయితే, ఈ క్రమంలోనే ఆయన పాత వీడియో ఒకటి సోషల్‌ మీడియాలో హల్‌చల్‌ చేస్తోంది. గతంలో కెనడా టోరంటోలోని ఓ కార్యక్రమంలో పాల్గొన్న అక్షయ్‌కుమార్‌.. ‘మీకో విషయం తప్పకుండా చెప్పాలి. టోరంటో నా సొంతూరు. బాలీవుడ్‌ చిత్ర పరిశ్రమ నుంచి రిటైరయ్యాక నేను ఇక్కడికే వచ్చి స్థిరపడతాను’ అని పేర్కొంటున్న వీడియో ఇప్పుడు హల్‌చల్‌ చేస్తోంది. దేశం మీద ప్రేమ ఉందంటూనే.. అక్షయ్‌కుమార్‌ ద్వంద్వ వైఖరిని చాటుతున్నారని ఈ వీడియోపై కొందరు విమర్శలు చేస్తుండగా.. గతంలో ఎప్పుడూ అన్న మాటలను వెలుగులోకి తెచ్చి.. అక్షయ్‌ దేశభక్తిని శంకించడం సరికాదని మరికొందరు వ్యాఖ్యానిస్తున్నారు.

Advertisement
 
Advertisement
 
Advertisement