తెలంగాణ డెవలప్‌మెం ట్ ఫోరం(టీడీఎఫ్) ఆధ్వర్యంలో కెనడాలోని టొరంటో నగరంలో శనివారం తెలంగాణ ఉత్సవాలు జరగనున్నాయి.
హైదరాబాద్: తెలంగాణ డెవలప్‌మెం ట్ ఫోరం(టీడీఎఫ్) ఆధ్వర్యంలో కెనడాలోని టొరంటో నగరంలో శనివారం తెలంగాణ ఉత్సవాలు జరగనున్నాయి. ఇప్పటికే అమెరికా, ఇంగ్లండ్‌తోపాటు చాలా దేశాల్లో తెలంగాణ ఉనికిని చాటుతూ ఉత్సవాలు నిర్వహించిన టీడీఎఫ్ ఈసారి కెనడాను ఎంచుకుంది. టొరంటోలో నిర్వహించే కార్యక్రమానికి తెలంగాణ సాంస్కృతిక సారథి చైర్మన్, ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ ప్రత్యేక అతి థిగా హాజరవుతారు.
తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను నేటి తరానికి పరిచయం చేయడంతోపాటు ఆటపాటలు, కెరీర్ గెడైన్స్, ఇమ్మిగ్రేషన్ చట్టాలపై అవగాహనకు సలహా లు, సూచనలందించేందుకు ప్రత్యేక కార్యక్రమాన్ని తెలంగాణ నైట్‌లో ఏర్పాటు చేసినట్లు ఆర్గనైజింగ్ కమిటీ తెలిపింది. తెలంగాణ వంటకాలు స్పెషల్ అట్రాక్షన్ కానున్నాయి.