కీరదోస... కంప్లీట్‌ హెల్త్‌ | good health | Sakshi

కీరదోస... కంప్లీట్‌ హెల్త్‌

Apr 30 2017 10:45 PM | Updated on Sep 5 2017 10:04 AM

కీరదోస... కంప్లీట్‌ హెల్త్‌

కీరదోస... కంప్లీట్‌ హెల్త్‌

కీరదోసలో పొటాషియం, మెగ్నీషియం, సోడియం ఉంటాయి. ఇవి రక్తపోటును క్రమబద్ధీకరిస్తాయి.

గుడ్‌ ఫుడ్‌

కీరదోసలో పొటాషియం, మెగ్నీషియం, సోడియం ఉంటాయి. ఇవి రక్తపోటును క్రమబద్ధీకరిస్తాయి. కీరదోస ఎండ తాపం నుంచి కాపాడడమేకాదు, హైబీపీని అదుపు చేస్తుంది. రోజూ ఒక కీరదోస తింటే సన్‌స్ట్రోక్‌ నుంచి తప్పించుకోవచ్చు, హైబీపీని నియంత్రించుకోవచ్చు. ఇంకా అనేక ప్రయోజనాలున్నాయి. కీరదోసలో 96 శాతం నీరే. ఈ నీరు దేహాన్ని డీహైడ్రేషన్‌కు గురికాకుండా కాపాడుతుంది. దేహంలోని టాక్సిన్స్‌ను బయటకు పంపేస్తుంది.ఎముకలు కీళ్ల పనితీరును మెరుగుపరుస్తుంది. అల్జీమర్స్‌ (మతిమరుపు) సమస్యను నివారిస్తుంది. గ్యాస్ట్రిక్‌ అల్సర్‌ నుంచి ఉపశమనాన్ని ఇస్తుంది.

కడుపులో లద్దెపురుగులను నిర్మూలిస్తుంది. చిగుళ్ల సమస్యలను, మూత్ర సంబంధ సమస్యలను నివారిస్తుంది. గోళ్లు పెళుసుబారడాన్ని తగ్గిస్తుంది. ప్యాంక్రియాస్‌ పనితీరులో లోపం వల్ల ఎదురైన సమస్యలను కీరదోస పరిష్కరిస్తుంది. మధుమేహంతో బాధపడేవారు రోజూ తినవచ్చు. బరువు తగ్గడానికి కూడా కీరదోస దోహదం చేస్తుంది. కాబట్టి అధికబరువు, స్థూలకాయంతో బాధపడేవారు కూడా హాయిగా తినవచ్చు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all

Video

View all
Advertisement