![How To Lose Weight: 7 Potassium Rich Foods May Help You - Sakshi](/styles/webp/s3/article_images/2021/09/7/How-To-Lose-Weight.jpg.webp?itok=ZiGINml7)
ప్రతీకాత్మక చిత్రం
నాజూకుగా.. సరైన బరువుతో.. ఆరోగ్యంగా ఉండాలని ఎవరు కోరుకోరు. అయితే, కొందరికి మాత్రం ఇది ఎప్పటికీ నెరవేరని కలలాగే మిగిలిపోతుంది. కానీ.. ఆలోచిస్తే ఆరువేల ఉపాయాలు ఉండనే ఉన్నాయిగా..! పొటాషియం పుష్కలంగా ఉండే ఆహారపదార్థాలతో అధికబరువుకు చెక్‌పెట్టొచ్చని నిపుణులు చెబుతున్నారు. ఈ 7 చక్కని మార్గాల ద్వారా ఏ విధంగా బరువు తగ్గొచ్చొ ఇప్పుడు తెలుసుకుందాం.
పొటాషియంతో ఎన్నో ప్రయోజనాలు..
పొటాషియం అనేది ఒక ముఖ్యమైన పోషకాహార ఖనిజం. మన శరీరంలోని కీలకమైన జీవక్రియల్లో దీని పాత్ర ఎనలేనిది. చెడు ద్రావణాల నుంచి రక్షణ కల్పించి, కండరాల నిర్మాణంలో సహాయపడుతుంది. అంతేకాకుండా జీవక్రియ సమతౌల్యానికి తోడ్పడుతుంది. గుండె, కిడ్నీలు సక్రమంగా, సమర్థవంతంగా పనిచేసేలా చూస్తుంది. ఈ అనేకానేక ప్రయోజనాలతోపాటు బరువు తగ్గడంలో కూడా పొటాషియం కీలకపాత్ర పోషిస్తుందన్నది నిపుణుల మాట.
నూట్రియంట్స్ జర్నల్ ప్రచురించిన టెల్ అవివ్ యూనివర్సిటీ పరిశోధనల నివేదిక ప్రకారం శరీరంలో పొటాషియం స్థాయి పెరగడం వల్ల బాడీ మాస్ ఇండెక్స్ (బీఎమ్‌ఐ) గణనీయంగా తగ్గుతుంది. ఆహారం ద్వారా పొటాషియం తీసుకున్న తర్వాత బీఎమ్‌ఐలో అంతకు మునుపు లేని మార్పులు కనిపించాయని అధ్యనాలు వెల్లడించాయి. కాబట్టి తగినంత పొటాషియం ఉన్న ఆహార పదార్ధాలు తినడం బరువు తగ్గడానికి సహాయపడుతుందని చెప్పవచ్చు.
అవిసె గింజలు
అవిసె గింజల్లో పొటాషియం అధికంగా ఉంటుంది. వీటిని నేరుగా తినొచ్చు లేదా ఇతర మిశ్రమాలతో కలిపి ద్రావణంగా తీసుకోవచ్చు. బరువు తగ్గడ్డానికి ఇది చాలా బాగా పనిచేస్తుంది.
అరటి పండు
సాధారణంగా ఏడాది పొడవునా అందరికీ అందుబాటులో ఉండదగ్గ ఫలాల్లో అరటి ఒకటి. అరటి పండులో ఐరన్, పొటాషియమ్ పుష్కలంగా ఉంటుంది. దీనిని నేరుగా తినవచ్చు లేదా ఇతర తృణధాన్యాలతో కలిపి తీసుకోవచ్చు. మీ బరువు తగ్గించేందుకు అరటి సహాయపడుతుందనడంలో ఎటువంటి సందేహం లేదు.
అవకాడో పండు
అవకాడో పండ్లు మెత్తగా, క్రీమీగా మధురమైన రుచిని కలిగి ఉంటాయి. వీటిని గుజ్జులా చేసుకుని అనేక రకాలుగా వినియోగిస్తారు. దీనిని వివిధ రకాలైన ఆహార పదార్ధలతో కలిపి తినోచ్చు.
చేప
పొటాషియం మాత్రమేకాకుండా బ్రెయిన్ హెల్త్‌కు ఎంతో ఉపకరించే ఒమేగా-3 కోవ్వు ఆమ్లాలు కూడా చేపలో అధికంగా ఉంటాయి. చేపలో క్యాలరీలు కూడా చాలా తక్కువ మోతాదులో ఉంటాయి. అందువల్ల బరువుతగ్గేందుకు సహాయపడే ఆహారాల్లో చేపలు ఉత్తమమైనవి.
చదవండి: బరువు తగ్గాలనుకుంటున్నారా..? కొబ్బరి తింటే సరి!
శనగలు
శాఖాహారులు ప్రత్యామ్నాయంగా వినియోగించదగిన ప్రొటీన్ ఫుడ్.. శనగలు. ఒక రాత్రంతా బాగా నానబెట్టిన శనగల్లో ఇతర ఇన్‌గ్రీడియన్ట్స్ మిక్స్ చేసి రుచి కరమైన హమ్మస్ క్రీమ్‌లా తయారు చేసుకోవాలి. దీన్ని బ్రెడ్ లేదా చపాతి తో కలిపి తినవచ్చు. మీ ఆహారంలో శనగలు చేర్చి తినడం ద్వారా సులువుగా బరువు తగ్గొచ్చు.
స్వీట్ పొటాటో లేదా చిలగడ దుంప
ఆవిరిపై ఉడికించిన చిలగడ దుంపలను కొన్ని రకాల మసాలా దినుసులతో కలిపి తినవచ్చు. యునైటెడ్ స్టేట్స్ డిపార్ట్‌మెంట్ ఆఫ్ అగ్రికల్చర్ (యూఎస్‌డీఏ) అధ‍్యయనం ప్రకారం వంద గ్రాముల స్వీట్ పొటాటోలో 337 మిల్లీగ్రాముల పొటాషియం ఉంటుంది.
కిడ్నీ బీన్స్ లేదా రాజ్మా
రాజ్మాలో ప్రొటీన్లతోపాటు పొటాషియం కూడా అధిక స్థాయిలో ఉంటుంది. దీనిని రోజువారీ ఆహారంలో చేర్చడం ద్వారా ప్రతి రోజూ మీ శరీరానికి అవసరమైన 35 శాతం పొటాషియం అందుతుంది.
►ఈ ఆహారపు అలవాట్లతో మీరు కోరుకునే శరీరాకృతిని సొంతం చేసుకునే అవకాశం కలుగుతుంది.
చదవండి: National Nutrition Week 2021: రోజూ ఉదయం ఈ డ్రింక్స్ తాగారంటే..
Comments
Please login to add a commentAdd a comment