హైబీపీ తగ్గాలంటే... | tricks to reduce High blood pressure | Sakshi
Sakshi News home page

హైబీపీ తగ్గాలంటే...

Published Mon, May 12 2014 11:27 PM | Last Updated on Sat, Sep 2 2017 7:16 AM

హైబీపీ తగ్గాలంటే...

హైబీపీ తగ్గాలంటే...

వ్యాయామం

* త్రయంగ్ ముఖైక పశ్చిమోత్తాసనాన్ని సాధన చేస్తే అధిక రక్తపోటు అదుపులోకి వస్తుంది.
*రెండు కాళ్లను చాపి, రెండు చేతులు మోకాళ్లపై ఉంచి, వెన్నెముక నిటారుగా పెట్టి సమస్థితిలో కూర్చోవాలి.
*కుడికాలును మోకాలు వద్ద మడిచి కుడి పిరుదు కిందగా కానీ పక్కగా కానీ ఉంచాలి. ఇప్పుడు రెండు చేతులను నిటారుగా పైకి లేపి *పూర్తిగా శ్వాస తీసుకుని శరీరాన్ని పైకి లాగినట్లు చేయాలి.
*శ్వాసను నిదానంగా వదులుతూ ముందుకి వంగి గడ్డాన్ని ఎడమ మోకాలుకు ఆనించి రెండు చేతులతో ఎడమపాదాన్ని పట్టుకోవాలి. ఈ స్థితిలో మోచేతులు నేలకు తాకాలి. ఛాతీని కాలిపైన అదిమి ఉంచాలి. ఈ స్థితిలో శ్వాసను వదిలి ఉండగలిగినంత సేపు ఉన్న తర్వాత మెల్లగా యథాస్థితికి రావాలి.
*ఇదే క్రమాన్ని ఎడమ మోకాలిని వంచి కుడిపాదాన్ని పట్టుకొని కూడా చేయాలి. ఇలా రోజుకు మూడు నుంచి ఐదుసార్లు చేయాలి.
* ఈ ఆసనాన్ని సాధన చేయడం వల్ల హైబీపీ అదుపులోకి రావడంతోపాటు అజీర్తి, గ్యాస్ట్రిక్ సమస్యలు, మలబద్ధకం పోతాయి. ఒత్తిడి కారణంగా వచ్చే తలనొప్పి, పార్శ్వపు నొప్పిని నివారించవచ్చు.

 సూచన: మోకాళ్ల నొప్పులు ఎక్కువగా ఉన్నవాళ్లు, అధికబరువు ఉన్న వాళ్లు, వెన్నునొప్పితో బాధపడుతున్న వాళ్లు ఈ ఆసనాన్ని సాధన చేయకూడదు. మడమల సమస్య ఉంటే నిపుణుల సలహాతో జాగ్రత్తగా చేయాలి.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement