కాబోయే తల్లికి ముఖ్య పరీక్షలివి | The main test for the prospective mother | Sakshi
Sakshi News home page

కాబోయే తల్లికి ముఖ్య పరీక్షలివి

Published Wed, Feb 15 2017 10:37 PM | Last Updated on Tue, Sep 5 2017 3:48 AM

కాబోయే తల్లికి ముఖ్య పరీక్షలివి

కాబోయే తల్లికి ముఖ్య పరీక్షలివి

కాబోయే తల్లికి ఈ కింది పరీక్షలు క్రమం తప్పకుండా చేస్తుంటారు. ఆ పరీక్షలేమిటీ, అవి ఎందుకు చేస్తారంటే...

అధిక రక్తపోటు (బీపీ టెస్ట్‌): గర్భిణికి రక్తపోటు ఎక్కువగా ఉంటే అది బిడ్డ ఆరోగ్యంపై, ఎదుగుదలపై ప్రభావం చూపవచ్చు. ఒక్కోసారి రక్తపోటు అధికం కావడం వల్ల కాబోయే తల్లికి ఫిట్స్, గుండె సవుస్యలు రావచ్చు. అందుకే... క్రవుం తప్పకుండా అధిక రక్తపోటు ఉందో లేదో చూడటం అవసరం.
  ఏ గ్రూపు రక్తం?... తల్లి రక్తం ఏ గ్రూపునకు చెందిందో తెలుసుకోవడం అవసరం. రక్తంలో సాధారణంగా ఏ, బీ, ఏబీ, ఓ గ్రూపులు ఉంటాయన్నది తెలిసిందే. ఇందులో ప్రతి గ్రూపులోనూ  పాజిటివ్, నెగెటివ్‌ అనే రెండు రీసస్‌ ఫ్యాక్టర్స్‌ ఉంటాయి. తల్లీ, తండ్రీ... ఇద్దరిదీ ఏ గ్రూపు రక్తం అయినా ఇద్దరి రీసస్‌ ఫ్యాక్టర్‌ పాజిటివ్‌ అయితే ఇబ్బంది లేదు. తల్లిది నెగెటివ్, తండ్రిది పాజిటివ్‌ అయి, పుట్టబోయే బిడ్డ రీసస్‌ ఫ్యాక్టర్‌ నెగెటివ్‌ అయినా పర్లేదు. కాని తల్లి ఫాక్టర్‌ నెగెటివ్‌ అయి, తండ్రిది పాజిటివ్‌ అయి, ఆ పాజిటివ్‌ ఫ్యాక్టర్‌ బిడ్డకు వచ్చినప్పుడు వూత్రం పాపకు పుట్టుకతోనే ఆరోగ్యసవుస్యలు వస్తాయి. తల్లిలోని యాంటీబాడీస్‌ పాపలోకి ప్రవేశించి పాప రక్తకణాలను దెబ్బతీయడమే దీనికి కారణం. అయితే ఈ సవుస్య మెుదటి ప్రెగ్నెన్సీ కంటే రెండోసారి గర్భధారణ సవుయంలో తప్పనిసరి. తల్లిదండ్రుల గ్రూపులు తెలుసుకుని, యంటీ–డీ అనే ఒకే ఒక ఇంజెక్షన్‌ ద్వారా పుట్టబోయే బిడ్డలో కాంప్లికేషన్స్‌ నివారించడమే కాదు, బిడ్డ ప్రాణాన్నీ రక్షించవచ్చు.

రక్తహీనత నిర్ధారణ పరీక్ష: మన దేశంలోని దాదాపు మహిళలందరిలోనూ ఉన్న ప్రధాన లోపం రక్తహీనత. ఫలితంగా బలహీనంగా ఉండటం, చిన్న పనికి వెంటనే అలసిపోవడం వంటి లక్షణాలు తల్లుల్లో కనిపిస్తుంటాయి. ఐరన్‌ వూత్రలతో ఈ పరిస్థితి నివారించవచ్చు. అందుకే కాబోయే తల్లులందరికీ ఈ పరీక్ష నిర్వహిస్తుంటారు.

బ్లడ్‌ షుగర్‌ పరీక్ష: గర్భిణి రక్తంలో చక్కెర పాళ్లు తెలుసుకోవడం చాలా అవసరం. గర్భంతో ఉన్నప్పుడు తల్లి ఎలాంటి ఆహారం తీసుకున్నా... ఆ సవుయంలో స్రవించే కొన్ని హార్మోన్ల వల్ల రక్తంలో చక్కెర పాళ్లు పెరిగేందుకు అవకాశం ఉంది. దాంతో ఉవ్మునీరు పెరగడం, శిశువ# పరివూణం పెరగడం వంటివి జరగవచ్చు. ఫలితంగా పాప గడువ#కు వుుందే పుట్టడం (ప్రీమెచ్యూర్‌ డెలివరీస్‌), లేదా పిండం గర్భంలోనే చనిపోవడం వంటివి జరిగే ఆస్కారం ఉంది. అందుకే క్రవుం తప్పకుండా బ్లడ్‌ షుగర్‌ పాళ్లు తెలుసుకుని, ఒకవేళ అది ఎక్కువగా ఉంటే నియంత్రణలో ఉంచుకోవడం అవసరం. గర్భిణుల్లో వుుందు నార్మల్‌గా ఉన్నా... వుుఖ్యంగా ఏడు, తొమ్మిది వూసాలప్పుడు ఈ చక్కెరపాళ్లు అకస్మాత్తుగా పెరిగే అవకాశం ఉంది. అందుకే ఈ సవుయంలో ఈ పరీక్షలు వురింత అవసరం.

సిఫిలిస్‌ పరీక్ష: ఇది సెక్స్‌ ద్వారా వ్యాప్తి చెందే ఒక వ్యాధి. తల్లికి నిర్వహించిన పరీక్షల్లో ఇది ఉన్నట్లు తేలితే వెంటనే చికిత్స తీసుకోవాలి. లేకపోతే... అబార్షన్‌కు దారితీయవచ్చు. లేదా వుృతశిశువ# పుట్టవచ్చు.

హెపటైటిస్‌–బి టెస్ట్‌: హైపటైటిస్‌–బి వైరస్‌ వల్ల సంక్రమించే ఒక వ్యాధి అన్న విషయం తెలిసిందే. అది గర్భంలోని పాపకు పుట్టుకతో రాకుండా నిరోధించేందుకు ఈ పరీక్ష అవసరం.

హెచ్‌ఐవీ పరీక్ష: ఎయిడ్స్‌ వ్యాధి నిర్ధారణకు చేసే పరీక్ష ఇది. కాబట్టి గర్భిణులందరికీ ఈ పరీక్ష తప్పనిసరి.

వుూత్ర పరీక్ష: ఈ పరీక్ష ద్వారా వుూత్రంలో చక్కెరపాళ్లు, ప్రొటీన్లు ఏమైనా ఉన్నాయేమో చూడాలి. యూరినరీ ట్రాక్ట్‌ ఇన్ఫెక్షన్స్‌ ఏమైనా ఉన్నాయేమో కూడా చూడాలి. యూరినరీ ట్రాక్ట్‌ ఇన్ఫెక్షన్లు ఉండి దానికి సరైన చికిత్స తీసుకోకపోతే పాప గడువ#కు వుుందే పుట్టడం (ప్రీమెచ్యూర్‌ డెలివరీస్‌) వంటివి జరగవచ్చు. లేదా బిడ్డ బరువ# తక్కువగానూ పుట్టవచ్చు.

థైరాయిడ్‌ పరీక్ష: బిడ్డ ఆరోగ్యకరమైన ఎదుగుదల కోసం తల్లిలో స్రవించే థైరాయిడ్‌ హార్మోన్‌ ఎంతో అవసరం.  బిడ్డ గర్భంలో ఉండే వ్యవధిలో మెుదటి సగం కాలంలో  పాప పెరుగుదలకు తల్లి థైరాయిడ్‌ హార్మోన్‌నే ఉపయోగపడుతుంది. కాబట్టి కాబోయే తల్లిలో ఏవైనా థైరాయిడ్‌ సవుస్యలుంటే, వాటిని చక్కదిద్దడం వల్ల తల్లిలో అబార్షన్‌ వంటి సవుస్యలనూ, బిడ్డలో ఎదుగుదల లోపాలనూ అరికట్టడానికి ఈ పరీక్ష ఎంతో అవసరం.

బిడ్డలో లోపాలు తెలుసుకోవడం కోసం...
పాప పుట్టకవుుందే బిడ్డలో లోపాలేమైనా ఉన్నాయేమో తెలుసుకునేందుకు పిండదశలోనే కొన్ని పరీక్షలు చేస్తారు. ప్రధానంగా స్కానింగ్‌ ప్రక్రియ ద్వారా నిర్వహించే పరీక్షలివి...
బిడ్డ గురించి చాలా విషయాలను తెలుసుకోవడం కోసం స్కానింగ్‌ పరీక్షలు ఉపయోగపడతాయి. ఉదాహరణకు కొన్ని...

న్యూకల్‌ ట్రాన్స్‌ల్యుయెన్సీ టెస్ట్‌: బిడ్డలో డౌన్స్‌ సిండ్రోమ్‌ వంటి జన్యుపరమైన లోపాలను తెలుసుకోడానికి ఈ పరీక్ష ఉపయోగపడుతుంది. పదమూడు వారాలప్పుడు చేసే ఈ పరీక్షతో ఇంకా...

పాప పుట్టబోయే తేదినీ వురింత నిర్దిష్టంగా కనుగొనడం
పుట్టబోయే పిల్లలు కవలలా, అయితే వారు ఏ రకం కవలలు అన్నది తెలుసుకోవడం

అప్పటికే పుర్రె, బిడ్డ పూర్తి స్వరూపం రూపొందుతుంది కాబట్టి శరీరంలో ఏవైనా అవకరాలున్నాయేమో అన్నది తెలుసుకోవడం

క్రోమోజోవుల్‌ సవుస్యలు ఏవైనా ఉన్నాయేమో తెలుసుకోవడం సాధ్యవువ#తుంది. ఈ స్కాన్‌ద్వారా దాదాపు 90% సవుస్యలను కనుగొని వాటిని రూల్‌ అవ#ట్‌ చేయవచ్చు.

ఫీటల్‌ అనావులీ స్క్రీనింగ్‌: అల్ట్రా సౌండ్‌ స్కానింగ్‌ ప్రక్రియ ద్వారా పుట్టబోయే బిడ్డలో ఏవైనా లోపాలు ఉన్నాయేమో తెలుసుకునేందుకు ఈ పరీక్ష చేస్తారు.  సాధారణంగా ఇది ప్రెగ్నెన్సీలో 18–20 వారాలప్పుడు చేసే పరీక్ష. ఈ పరీక్ష ద్వారానే పుట్టబోయే బిడ్డలో ఏవైనా గుండెకు సంబంధించిన లోపాలుంటే తెలుసుకుంటారు. ఫలితంగా ఏదైనా అవసరం ఉంటే పుట్టిన వెంటనే తక్షణ చికిత్స అందించి, పాపను రక్షించుకోడానికి వీలుంటుంది. గ్రహణం మొర్రి (క్లెఫ్ట్‌ లిప్‌), వెన్నెవుుకలో లోపాలు లాంటివి ఈ పరీక్ష ద్వారా తెలుసుకునే వీలుంది. ఇలాంటి లోపాలుంటే ఎంత చిన్న వయస్సులో శస్త్రచికిత్స ద్వారా సరిచేస్తే అంతగా సత్ఫలితాలుంటాయి.
ఈ స్కాన్‌లతో పాటు కొన్ని రక్త (ప్రోటీన్‌) పరీక్షలతో 95% సవుస్యలను తెలుసుకుని, అవి లేవని నిర్ధారణ చేయవచ్చు.

ప్రెగ్నెన్సీలో డిప్రెషన్,  యాంగై్జటీలకు దూరంగా...
మీకు ఇష్టమైన హాబీలు పెంపొందించుకోవాలి. వ్యాపకాలను సృష్టించుకోవాలి. దీనివల్ల మీ మూడ్స్‌ ఆహ్లాదంగా ఉంటాయి.
కంటినిండా నిద్రపోవాలి.
ప్రవసం గురించి ఆందోళన పడకండి. అది చాలా హాయిగా జరిగిపోతుందని అనుకోండి. సిజేరియన్‌ గురించి, పురిటినొప్పుల గురించి భయపడకండి. బిడ్డపుట్టాక పాలు పడతాయా లేదా అని ఇప్పటి నుంచే ఆందోళన చెందకండి. ఇలా అనవరసమైన ఆందోళనల వల్ల బిడ్డ మీద ప్రతికూల ప్రభావాలు ఉంటాయని అధ్యయనాలు చెబుతున్నాయి.
ఫ్రెండ్స్, కుటుంబసభ్యుల నుంచి వచ్చే సలహాలు, సూచనల్లో మీరు అనుసరించగలిగినవే చేయండి. 
మీకు శ్రమకలిగించే మల్టీటాస్కింగ్‌ వంటివి ఆ సమయంలో చేయకండి. మీకు మానసిక ఒత్తిడి కలిగించే పనులేమీ చేయవద్దు.
ఈ టైమ్‌లో యాంగై్జటీని తగ్గించడానికి మంచి పుస్తకాలు చదవడం, టీవీలో ఉల్లాసాన్నిచ్చే హాస్యభరితమైన కార్యక్రమాలు చూడటం వంటి పనులు చేయండి.
ప్రతిదీ మీరే స్వయంగా చేయాలని అనుకోకండి. కొన్ని ఇంటి పనులు మీ కుటుంబసభ్యులకూ అప్పగించండి.
డాక్టర్‌ భావన కాసు
కన్సల్టెంట్‌ అబ్‌స్టెట్రిషియన్‌ అండ్‌ గైనకాలజిస్ట్,  బర్త్‌ రైట్‌ బై రెయిన్‌బో,  హైదరాబాద్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement