Complications
-
గుమ్మడి పండంటి బిడ్డ... రిస్క్ టాస్క్..
పుట్టబోయే ఆ చిన్నారి ఒకింత బొద్దుగా ఉండాలని అందరూ కోరుకుంటారు. కాస్తంత బొద్దుగా ఉంటే పర్వాలేదు గానీ మరీ ఎక్కువ బరువుండటం తల్లీ, బిడ్డా ఇద్దరికీ చేటు చేసే అంశం. అదెలాగంటే... మహిళలు గర్భం దాల్చినప్పుడు వారిలో కొంతమందికి తాత్కాలికంగా చక్కెరవ్యాధి వస్తుంది. ఇలా కేవలం వారు గర్భవతులుగా ఉన్నప్పుడు వచ్చే చక్కెరవ్యాధిని ‘జెస్టెషనల్ డయాబెటిస్’ అంటారు. ఈ కండిషన్ ఉన్న మహిళలకు పుట్టే చిన్నారులు కాస్తంత ఎక్కువ బరువుతో పుట్టవచ్చు. అయితే ఇలాంటి సమయాల్లో కాస్తంత ఎక్కువ బరువుగా పిల్లలు పుడితే అది బిడ్డలకు ముప్పుగానూ పరిణమించవచ్చు. జెస్టెషనల్ డయాబెటిస్ ఉన్నవారికి పుట్టే పిల్లలు కాస్తంత ఎరుపు రంగులో ఉండటంతో వారిని ‘టొమాటో బేబీస్’ అంటారు. దీనికి కారణం... పిల్లలు తల్లి గర్భంలో ఉన్నప్పుడు వారికి ఆహారం అందించే క్రమంలోనూ, ఇతరత్రా రక్తప్రవాహం తోపాటు తల్లిలోని చక్కెర చిన్నారుల శరీరాల్లోకీ ప్రవేశిస్తుంది. ఈ పరిస్థితిని నియంత్రించడానికి చిన్నారిలోనూ ఇన్సులిన్ ఎక్కువగా స్రవిస్తుంది. దీని మరో పరిణామం ఏమిటంటే... గర్భంలోని బిడ్డ... తన తల్లి నుంచి చాలా ఎక్కువ మోతాదులో పోషకాలను స్వీకరిస్తుంది. అందుకే గర్భసంచిలో ఉన్న బిడ్డ సాధారణం కంటే చాలా ఎక్కువ బరువు పెరుగుతుంది. వీళ్లలో హిమోగ్లోబిన్ మోతాదు సాధారణం కంటే చాలా ఎక్కువగా ఉంటుంది. ఇలా పిల్లలు మరీ ఎక్కువ బొద్దుగా, బరువు ఎక్కువగా ఉండటాన్ని వైద్యపరిభాషలో ‘మాక్రోసోమియా’ అంటారు. సరిగ్గా ఈ అంశమే... ఇటు పుట్టబోయే బిడ్డకూ, అటు జన్మనిస్తున్న తల్లికీ... ఇద్దరికీ ప్రమాదం తెచ్చిపెట్టే అవకాశం ఎక్కువ. అందుకే ఇలాంటి సందర్భాల్లో ... ప్రసవం చేసే డాక్టర్ అయిన అబ్స్ట్రెట్రీషియన్లు అల్ట్రాసౌండ్ స్కానింగ్ ద్వారా బిడ్డ ఏ మేరకు బొద్దుగా ఉన్నారనే అంశాన్ని అంచనా వేస్తారు. ఒక్కోసారి సాధారణ ప్రసవం అవుతుందని అనుకున్నా, తల మాత్రమే బయటకు వచ్చి (శీర్షోదయమై) భుజాలు ప్రసవమార్గంలో ఇరుక్కుపోవచ్చు. ఇలా జరగడాన్ని ‘షోల్డర్ డిస్టోసియా’ అంటారు. అదొక మెడికల్ ఎమర్జెన్సీ సమస్య. ఇలాంటి అన్ని అంశాలూ దృష్టిలో పెట్టుకున్నప్పుడు బిడ్డ మరీ బొద్దుగా ఉంటే అది ప్రమాదకరమైన పరిస్థితికి దారితీయవచ్చు. పైగా బొద్దుగా ఉండటం అన్న అంశం ఆరోగ్యానికి ఏమాత్రం సూచిక కాదు. అది ఛైల్డ్‌హుడ్ ఒబేసిటీకి దారితీయవచ్చు. దీనికి బదులుగా బిడ్డ సన్నగా ఉన్నా... ఆరోగ్యంగా ఉండటమనేది అందరూ కోరుకునే అంశం. అందుకే చిన్నారి బొద్దుగా పుట్టడం / ఉండటం కంటే ఆరోగ్యంగా పుట్టాలని కోరుకోవడం మంచిది. (చదవండి: 'ఎల్లప్పుడూ స్ట్రాంగ్‌గా ఉండాలంటే'..!: ఇవాంక ట్రంప్ ఫిట్నెస్ మంత్ర..!) -
అమ్మాయిలు ఏ వయసులో పెళ్లిచేసుకోవాలి? 30 దాటితే ప్రెగ్నెన్సీ కష్టమేనా?
ఏ వయసులో జరగాల్సిన ముచ్చట ఆ వయసులో జరగాలి అంటుంటారు. ఈ సామెత వచ్చింది కూడా పెళ్లి గురించే. ఒకప్పుడు అంటే ఆడపిల్లలకు 18ఏళ్లు రాగానే పెళ్లిళ్లు చేసేవారు. కానీ ఇప్పుడు కాలం మారింది. పెళ్లి విషయంలో అబ్బాయిలతో పాటు అమ్మాయిల ఆలోచన ధోరణి కూడి మారింది. అసలు లైఫ్‌లో పెళ్లి అంత ముఖ్యం కాదు.. చేసుకోవాలని లేదు అని ఈ కాలం యువత అనుకుంటున్నారట. ఆరోగ్యరీత్యా ఆడపిల్లలు ఏ వయసులో పెళ్లి చేసుకోవడానికి, పిల్లలను కనడానికి సరైన సమయం? 30తర్వాత పెళ్లిళ్లు చేసుకుంటే ప్రెగ్నెన్సీలో కాంప్లికేషన్స్ ఎలా ఉంటాయి? ఈ రోజుల్లో ప్రతి ఆడపిల్లా ఉన్నత చదువుల కోసం ప్రయత్నిస్తోంది. దాంతో పెళ్లి, పిల్లలు వంటి బాధ్యతలు తీసుకోవడానికి తొందరపడట్లేదు. అనేకంటే సిద్ధంగా ఉండట్లేదు అనొచ్చేమో! అందుకే 35 ఏళ్లు దాటిన తరువాత ప్రెగ్నెన్సీతో వచ్చే అమ్మాయిలను ఎక్కువగా చూస్తున్నాం. ఎర్లీ మ్యారెజెస్లో ఇంకో రకమైన సమస్యలను చూస్తున్నాం. కాబట్టి పెళ్లికి ఏది సరైన వయసు అని చెప్పడం కాస్త కష్టమే. అయితే ఈ రెండు పారామీటర్స్‌ని దృష్టిలో పెట్టుకుని 28–32 ఏళ్ల మధ్య వయసును బెస్ట్ ఏజ్‌గా చెప్పాయి కొన్ని అధ్యయనాలు. ఈ వయసుకల్లా అటు వృత్తిపరంగా స్థిరపడడమే కాక పెళ్లి, పిల్లలు వంటి నిర్ణయాలు తీసుకునేందుకు మానసికంగానూ సంసిద్ధత వచ్చేస్తుంది. శారీరక ఆరోగ్యమూ సహకరిస్తుంది. ఎమోషనల్గానూ బ్యాలెన్స్డ్గా ఉంటారు. ముప్పై ఏళ్లు దాటిన తర్వాత అమ్మాయిల్లో.. నేచురల్, స్పాంటేనియస్ ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశాలు తగ్గుతుంటాయి. చాలామందిలో మారిన జీవన శైలి వల్ల అండాల నాణ్యతా తగ్గిపోతుంది. ఏఎమ్‌హెచ్ అనే పరీక్షతో దీన్ని కనిపెట్టవచ్చు. 30 –35 మధ్యలో ప్రెగ్నెన్సీ వస్తే బీపీ, సుగర్ వచ్చే చాన్సెస్ పెరుగుతాయి. ఆలస్యంగా పెళ్లి చేసుకోవడంతో పిల్లల్ని కనడమూ ఆలస్యమవుతుంది. దీనివల్ల ఆరోగ్య సమస్యలు పెరుగుతాయి. కాబట్టి 28–30 ఏళ్ల మధ్య వయసులో పెళ్లి ప్లాన్ చేసుకుంటే అన్ని రకాలుగా మంచిది. ప్రెగ్నెన్సీలో కూడా కాంప్లికేషన్స్ తగ్గుతాయి. డా‘‘ భావన కాసు గైనకాలజిస్ట్ – ఆబ్స్టెట్రీషియన్, హైదరాబాద్ -
Corona Virus: ‘లాంగ్ హాలర్స్’ అంటే ఎవరో తెలుసా?
కరోనా గురించి కొత్త కొత్త పరిశోధనల్లో తేలుతున్న విషయాలు ఆశ్చర్యానికి గురిచేస్తున్నాయి. అలాంటి ఒక అధ్యయనంలో ఈ ‘లాంగ్ హాలర్స్’ గురించి తెలిసింది. ‘కరోనా వైరల్ ఇన్ఫెక్షన్ నుంచి బాగైపోయాం’ అనుకున్నవారిని సైతం కోవిడ్ లక్షణాలు మరికొంతకాలం పాటు బాధపెడుతుంటాయి. అలా బాధపడే పరిస్థితిని ‘లాంగ్ కోవిడ్’ లేదా ‘పోస్ట్ అక్యూట్ కోవిడ్–19’ అనీ... అలా బాధపడేవారినే ‘‘లాంగ్ హాలర్స్’’గా పేర్కొంటున్నారు. క్లివ్లాండ్ క్లినిక్‌లోని లోరియన్ ఫ్యామిలీ హెల్త్ సెంటర్... ‘ఫ్యామిలీ మెడిసిన్’ విభాగానికి చెందిన వైద్యపరిశోధకుడు క్రిస్టోఫర్ బబియుక్ అనే పరిశోధకుడు ‘పోస్ట్ అక్యూట్ కోవిడ్–19’ గురించీ... అలాగే ‘లాంగ్ హాలర్స్’పై తన పరిశోధన పత్రాన్ని సమర్పించగా... ఇటీవలే దీని వివరాలను బయటికి వెల్లడించారు. లాంగ్ హాలర్స్ అంటే ఎవరు, వారి లక్షణాలేమిటి, వారి సమస్యలకు కారణాలేమిటి లాంటి అనేక విషయాలు తెలిపేదే ఈ కథనం. ‘పోస్ట్ అక్యూట్ కోవిడ్–19 (లాంగ్ కోవిడ్)’ బాధితులు ఎవరు? ఈ ‘పోస్ట్ అక్యూట్ కోవిడ్–19 (లాంగ్ కోవిడ్)’ బారిన ఎవరు పడతారు? ఎలాంటి లక్షణాలూ లేని అసింప్టమాటిక్ రోగులు దీని బారిన పడరా? కేవలం మూడు, నాలుగు వారాల పాటు కూడా నెగెటివ్ రానివారే దీని బారిన పడతారా?... ఈ సందేహాలు మీ మదిలో రావచ్చు. కానీ అలాంటి మినహాయింపులేమీ ఈ లాంగ్ హాలర్స్కు ఉండవంటున్నారు పరిశోధకులు. ఎలాంటి లక్షణాలూ లేకుండా ఉన్నవారూ, కొద్దిపాటి లక్షణాలతో తేలిగ్గానే కరోనా బారినుంచి తప్పించుకున్నవారు మొదలుకొని సుదీర్ఘకాలం పాటు దాని బారిన పడ్డవారు ‘పోస్ట్ అక్యూట్ కోవిడ్–19 (లాంగ్ కోవిడ్)’ బారిన పడవచ్చు. అలాగే ఎవరో వయోవృద్ధులకు మాత్రమే అది పరిమితమేమో అంటూ కూడా పొరబడవద్దు. ఎందుకంటే... యౌవనంలో ఉన్నవారూ, నడివయసువారు, అప్పుడే వృద్ధాప్యంలో అడుగుపెట్టినవారు మొదలుకొని బాగా వయోవృద్ధుల వరకు అందరూ దీనిబారిన పడే అవకాశాలున్నాయంటున్నారు క్రిస్టోఫర్ బబియుక్ అనే పరిశోధకుడు. పైగా ఇదొక ఛాలెంజింగ్ పరిస్థితి అని... అందరికీ ఒకేలాంటి చికిత్స కాకుండా... ప్రతి ఒక్కరికీ వారి వారి పరిస్థితి ని బట్టి వేర్వేరు చికిత్సలు అందించేలా జబ్బు విసురుతున్న సవాలే ఈ సమస్య అని క్రిస్టోఫర్ బబియుక్ పేర్కొంటున్నారు. ఆయన పేర్కొన్న శాస్త్రీయ వివరాలు చాలావరకు సాధారణ ప్రజలకూ పనికివచ్చేవే. ప్రశ్న: గతంలో చాలా దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడేవారే ‘లాంగ్ హాలర్స్’గా మారే అవకాశం ఉందా? సమాధానం: ఒకరకంగా అలాగే అనుకోవచ్చు. కానీ కచ్చితంగా అదేనిజం అని అనుకోడానికి కూడా వీల్లేదు. ఎందుకంటే గత మన అనుభవాలను బట్టి గతంలో ఏదో క్రానిక్ జబ్బులతో బాధపడేవారే ఇలా సుదీర్ఘకాలం పాటు ఏవో లక్షణాలతో బాధపడుతుంటారని తేలినా... కొందరు మామూలు వ్యక్తుల్లో సైతం కొన్ని లక్షణాలు అదేపనిగా కొనసాగుతున్నాయి. అందుకే ఈ స్థితి ఫలానా నిర్దిష్ట వ్యక్తుల్లోనే కనిపిస్తుందని ఇదమిత్థంగా ఇప్పుడే చెప్పడానికి వీలు కావడం లేదు. ప్రశ్న : ఈ లాంగ్ హాలర్స్లో కనిపిస్తున్న లక్షణాలేమిటి? సమాధానం: చాలా లక్షణాలే ఈ లాంగ్ హాలర్స్లో ఉన్నాయి. అవి... దీర్ఘకాలికం గా కొనసాగే తీవ్రమైన దగ్గు, ఛాతీ పట్టేసినట్టుగా ఉండటం, శ్వాస సరిగా అందకపోవడం, తలనొప్పి, ఒళ్లునొప్పులు, కండరాల నొప్పులు, కొందరిలో నీళ్లవిరేచనాలు కూడా. అయితే ఈ అందరిలోనూ కనిపిస్తూ ఉండే ఒకే ఒక లక్షణం తీవ్రమైన అలసట. దీన్నే ‘క్రానిక్ ఫెటీగ్’గా చెప్పవచ్చు. ఇలాంటి చాలామంది లాంగ్ హాలర్స్లో ‘బ్రెయిన్ ఫాగ్’ కూడా కనిపిస్తోంది. అంటే... మంచు కప్పి ఉన్నప్పుడు ఏదీ స్పష్టంగా తెలియనట్టే... వీళ్లలో కూడా ఏ ఆలోచనా స్పష్టంగా లేక అయోమయానికి గురవుతుంటారు. దీన్నే ‘బ్రెయిన్ ఫాగ్’ అని అంటారు. ప్రశ్న : ఈ లాంగ్ హాలర్స్ నుంచి ఈ లక్షణాలు ఒకరి నుంచి మరొకరికి పాకుతాయా అంటే ఈ ‘పోస్ట్ అక్యూట్ కోవిడ్–19 (లాంగ్ కోవిడ్)’ అంటువ్యాధా? సమాధానం : అదృష్టవశాత్తూ కాదు. ఎందుకంటే ఇవన్నీ అప్పటికే కరోనా సోకి తగ్గినవారిలో కనిపించే కొన్ని దీర్ఘకాలిక లక్షణాలు. అంతేతప్ప ఇదో వ్యాధి కాదు. అందునా అంటువ్యాధి కాదు. అందుకే, అంటుకుంటుందేమో అని దీనిగురించి ఆందోళన అక్కర్లేదు. కేవలం కరోనా వైరస్‌తో ఇన్ఫెక్ట్ అయినవారి నుంచే ఆ వైరస్ మరొకరికి అంటుకుంటుది. రెండువారాల తర్వాత వైరస్ దేహం నుంచి తొలగిపోయాక ఏ రోగీ కరోనాను వ్యాపింపజేయలేడు. (అతడు కాంటేజియస్ కాదు). కాబట్టి వ్యాధి సోకిన రెండు వారాల తర్వాత అటు రోగినీ, ఇటు లాంగ్ హాలర్స్నీ అనుమానాస్పదంగా చూడాల్సిన అవసరం లేదు. పైగా వారికి సమాజం నుంచి మరింత సానుభూతి, సహకారం అవసరం. ప్రశ్న: కొందరిలో ఈ లక్షణాలు సుదీర్ఘకాలం ఎందుకు కొనసాగుతున్నాయి? సమాధానం : కరోనా వచ్చి తగ్గాక చాలామందిలో అది వారి అంతర్గత అవయవాల్లో ‘ఇన్ఫ్లమేషన్’ (వాపు, మంట లాంటి స్థితి) తీసుకొస్తుందన్న విషయం తెలిసిందే కదా. బహుశా ఆ ‘ఇన్ఫ్లమేటరీ కండిషన్స్’ అన్నీ సాధారణ స్థితికి వచ్చేవరకు ఈ లక్షణాలన్నీ కొనసాగుతున్నాయని శాస్త్రవేత్తలూ, పరిశోధకుల అంచనా. అందుకే ఈ అంశాలపై ఇప్పటికే పరిశోధన కొనసాగుతోందనీ, ఇంకా చాలా అధ్యయనాలు అవసరమని పరిశోధకులు చెబుతున్నారు. ఈ పరిశోధనలు కొనసాగితే సుదీర్ఘకాలంలో అప్పటికే కిడ్నీవ్యాధులు, ఊపిరితిత్తుల వ్యాధులు, గుండెజబ్బులు ఉన్నవారిపై కరోనా వైరల్ ఇన్ఫెక్షన్ ప్రభావం వల్ల కలిగే ఫలితాలేమిటో తెలిసే అవకాశం ఉంది. ఇప్పటికైతే పరిశోధనలు మాత్రం విస్తృతంగా కొనసాగుతున్నాయి. ప్రశ్న: ఇప్పుడీ పరిస్థితిలో ‘లాంగ్ హాలర్స్’ ఏం చేయాలి? సమాధానం : కరోనా తగ్గిందనీ, తమకు నెగెటివ్ వచ్చిందని తెలిశాక కూడా లక్షణాలు కనిపిస్తున్నా లేదా కోవిడ్–19 వచ్చి తగ్గిందనుకున్న 28 రోజుల తర్వాత కూడా మళ్లీ లక్షణాలు కనిపిస్తున్నా ముందుగా వారు డాక్టర్‌ను సంప్రదించాలి. ఇప్పటికి ఉన్న అవగాహన మేరకు దీర్ఘకాలిక సమస్యలు ఉన్నవారు తమ పల్మునరీ (ఊపిరితిత్తులకు సంబంధించిన), కార్డియోవాస్కులార్ (గుండెకు సంబంధించిన), న్యూరలాజికల్ (మెదడు సంబంధిత) పరీక్షలను వారి వారి డాక్టర్ల సలహాల మేరకు చేయించుకుంటూ ఉండాల్సి రావచ్చు. ఇక ఆ తర్వాత వారంతా క్రమం తప్పకుండా దేహానికి మంచి ఖనిజలవణాలు దొరికేలా ఎప్పుడూ ద్రవాహారాలు తీసుకుంటూ, తగినంత విశ్రాంతి తీసుకుంటూ, మంచి ఆహారం తింటూ, కంటినిండా నిద్రపోతూ... శారీరక, మానసిక ఒత్తిళ్ల నుంచి దూరంగా ఉండాలి. ఈ అంశాలన్నింటినీ ఆరోగ్యవంతులూ, కరోనాకు గురికాని వారందరు కూడా పాటిస్తే అవి వాళ్లందరికీ మేలు చేసేవే. ప్రశ్న: లాంగ్ హాలర్స్ వ్యాక్సిన్ తీసుకోవచ్చా? సమాధానం : లాంగ్ హాలర్స్తో సహా... ప్రతివారూ, కరోనా వచ్చి తగ్గిన వారు సైతం (వారి వారి దేశాల్లోని ప్రభుత్వ, వైద్య సంస్థలు చెప్పిన నిర్ణీత కాల వ్యవధి ముగిశాక) తప్పక వ్యాక్సిన్ తీసుకోవాల్సిందే. -
కరోనా: ఈ వ్యాధి ఉన్నోళ్లు జర జాగ్రత్త!
సాక్షి, హైదరాబాద్: చిగుళ్ల వ్యాధితో కరోనా వైరస్ త్వరగా శరీరంలోకి ప్రవేశిస్తుందని డాక్టర్ గౌడ్స్ డెంటల్ పరిశోధనా బృందం అధిపతి డాక్టర్ వికాస్‌గౌడ్ వెల్లడించారు. చిగుళ్లు చెడిపోయినప్పుడు వైరస్ సులువుగా ఊపిరితిత్తుల్లోకి లేదా నేరుగా రక్తంలోకి వెళ్తుందని తెలిపారు. అంతర్జాతీయ జర్నల్స్‌లో గత కొన్నాళ్లుగా వచ్చిన సమాచారాన్ని క్రోడీకరించి ఈ వివరాలు తెలిపారు. నోటి పరిశుభ్రత సరిగా పాటించకపోవడం వల్ల, చిగుళ్ల వాపు ద్వారా వైరస్ తీవ్రతను పెంచుతాయని ఓ ప్రకటనలో వివరించారు. చిగుళ్ల వద్ద ఉండే వాహకాలు (ఏసీఈ–2) వైరస్‌ను శరీరంలోకి తీసుకెళ్తాయని పేర్కొన్నారు. మధుమేహం, విటమిన్–సి కొరత, కేన్సర్, పొగాకు, గుట్కా వినియోగించే వారికి చిగుళ్ల సమస్యలు ఎక్కువగా వస్తాయని, వీరికి మరింత ఎక్కువ ప్రమాదం ఉంటుందని తెలిపారు. అందుకే 6 నెలలకో సారి వైద్యులను సంప్రదించి, వారి పర్యవేక్షణలో దంతాలను శుభ్రం చేయించుకోవాలని సూచించారు. ఉబ్బిన చిగుళ్లతో వైరస్ లోడ్ పెరుగుతుందని, నోటి పరిశుభ్రతను పాటించడం ద్వారా వైరల్ ఇన్ఫెక్షన్ రేటు తగ్గుతుందని వివరించారు. (చదవండి: తెలంగాణ మాజీ మంత్రి చందూలాల్ కన్నుమూత) -
కరోనాతో మరో ముప్పు
లండన్ : కరోనా మహమ్మారిని నిలువరించేందుకు ప్రపంచ దేశాలు అష్టకష్టాలు పడుతున్నసమయంలో మరో సంచలన విషయం వెలుగు చూసింది. కోవిడ్-19 రోగుల్లో పలు రకా మెదడు, నాడీ సంబంధిత సమస్యలను గుర్తించామని లండన్ పరిశోధకులు తాజాగా వెల్లడించారు. ప్రపంచవ్యాప్తంగా ఇలాంటి సమస్యలను గుర్తించినట్టు పరిశోధకులు తెలిపారు. లివర్‌పూల్ విశ్వవిద్యాలయం సహా, ఇతర శాస్త్రవేత్తల అభిప్రాయం ప్రకారం కరోనా రోగుల్లో స్ట్రోక్స్, మతిమరుపు ఇతర నాడీ సంబంధిత,మానసిక సమస్యలను కరోనాకు భారీగా ప్రభావితమైన దేశాలు నివేదించాయి. ది లాన్సెట్ న్యూరాలజీలో ప్రచురించిన ఈ అధ్యయనాల ప్రకారం గందరగోళం, స్ట్రోక్, మెదడు వాపు, వెన్నుపాము, నరాల వ్యాధి వంటి ఇతర సమస్యలు కూడా సంభవించవచ్చని పరిశోధకులు వెల్లడించారు. దాదాపు వెయ్యి మంది రోగులు ఇలాంటి సమస్యలకు గురైనారన్నారు. ఇవి అరుదుగా కనిపించే సమస్య లైనప్పటికీ, బాధితుల సంఖ్య చాలా ఎక్కువుగా ఉంటుందని లివర్‌పూల్ విశ్వవిద్యాలయం అధ్యయనవేత్త సుజన్నా లాంత్ అన్నారు. ప్రధానంగా బాధితుల్లో వినాశకర, తీవ్ర పరిణామాలకు దారితీసేఎన్‌సెఫలిటిస్ (మెదడులో ఇన్ఫెక్షన్ లేదా వాపు) ముప్పు ఒకటనీ ఈ విషయాన్ని ప్రపంచవ్యాప్తంగా వైద్యులు గుర్తించడం చాలా ముఖ్యమని మరో శాస్త్రవేత్త అవా ఈస్టన్ చెప్పారు. ప్రపంచంలోని అనేక ప్రాంతాల్లో ఇటువంటి సమస్యలుండగా, దీనిపై సమగ్ర వివరాలు తమకు అందలేదని పేర్కొన్నారు. ఈ అంశంపై పూర్తి అవగాహన రావాలంటే ప్రపంచంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన డేటాను సమీక్షించాల్సి ఉందన్నారు. మరోవైపు ఇటీవల ‘బ్రెయిన్’ పత్రికలో ప్రచురించిన పరిశోధన ప్రకారం అత్యంత అరుదైన, మెదడులో మంట పుట్టించే ఏడీఈఎం అనే ఇన్ఫెక్షన్ కరోనా వచ్చిన వారిలో పెరుగుతోంది. కరోనా విస్తరిస్తున్న క్రమంలో ఈ తరహా బాధితుల సంఖ్య కూడా భారీగా పెరుగుతోంది. ముఖ్యంగా మెదడులో మంటతో పాటు, డెలిరియం, బ్రెయన్ స్ట్రోక్ వంటి ప్రమాదకర పరిస్థితులు తలెత్తే అవకాశముందని పరిశోధనలో తేలినట్టు నివేదించింది. -
గ్లోబల్ వార్మింగ్‌తో పెను వినాశనమే!
ప్రపంచదేశాలు గ్లోబల్‌వార్మింగ్‌ను అరికట్టకపోతే ఊహకు అందని ఉపద్రవాలు సంభవిస్తాయని ఐక్యరాజ్యసమితి(ఐరాస) హెచ్చరించింది. అతివృష్టి, అనావృష్టి కారణంగా ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మంది ఉపాధిని కోల్పోతారని వెల్లడించింది. దీని కారణంగా భారత్, పాకిస్తాన్లో తీవ్రమైన వడగాలులు వీస్తాయని పేర్కొంది. ఈ మేరకు ఐక్యరాజ్యసమితికి చెంది న ఇంటర్‌గవర్నమెంటల్ ప్యానెల్ క్లైమేట్ ఛేంజ్ (ఐపీసీసీ) ప్రత్యేక నివేదికను విడుదల చేసింది. భారత్‌లోని తీరప్రాంత నగరమైన కోల్‌కతాతో పాటు పాకిస్తాన్ ఆర్థిక రాజధాని కరాచీపై గ్లోబల్ వార్మింగ్ ప్రభావం తీవ్రంగా ఉంటుంద ని ఐపీసీసీ తన నివేదికలో తెలిపింది. విచ్చలవిడిగా శిలాజ ఇంధనాల వాడకం, అడవుల నరికి వేత కారణంగా ప్రపంచవ్యాప్తంగా సగటు ఉ ష్ణోగ్రతలో పెరుగుదల 1.5 డిగ్రీ సెల్సియస్ దాటిపోతుందని వెల్లడించింది. తద్వారా భూ తాపం పెరిగి భారత్, పాకిస్తాన్లో తీవ్రమైన వడగాలులు వీస్తాయంది. ప్రపంచవ్యాప్తంగా 40 దేశాలకు చెందిన 91 మంది నిపుణులు ఈ నివేదిక రూపకల్పనలో పాలుపంచుకున్నారు. అంటువ్యాధుల విజృంభన.. ఒకవేళ 2030 నాటికి ఈ ఉష్ణోగ్రతలు 2 డిగ్రీల సెల్సియస్ మేరకు పెరిగితే జరిగే విధ్వంసం ఊహకు కూడా అందదని ఐపీసీసీ తెలిపింది. తొలుత వాతావరణ మార్పులతో అతివృష్టి, ఆపై అనావృష్టి సంభవిస్తాయని నివేదికలో వెల్లడించింది. ‘ఉష్ణోగ్రతలు విపరీతంగా పెరగడంతో పంటల దిగుబడి తగ్గిపోతుంది. దీనికి తోడుగా ప్రపంచవ్యాప్తంగా కీటకాల ద్వారా వ్యాప్తిచెందే అంటువ్యాధులు, డెంగీ, మలేరియా వంటి జ్వరాలు తీవ్రరూపం దాలుస్తాయి. ఓవైపు ఆహారకొరత, మరోవైపు అనారోగ్యం కారణంగా ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మంది మృత్యువాత పడతారు. భారత్‌లోని మెట్రో నగరాల్లో తీవ్రమైన ఎండకు తోడు ప్రాణాంతకమైన వడగాలులు వీస్తాయి. ఇవి దాదాపు 35 కోట్ల మంది ప్రజలపై ప్రభావం చూపుతాయి. ధ్రువ ప్రాంతాల్లో మంచు కరిగిపోవడంతో సముద్రమట్టాలు భారీగా పెరుగుతాయి. తద్వారా తీరప్రాంతాలు మునిగిపోతాయి. ఉష్ణోగ్రతలు అదుపుకాకపోవడంతో అడవుల్లో కార్చిచ్చులు చెలరేగుతాయి. అతివృష్టి, అనావృష్టితో పాటు అంటువ్యాధుల దెబ్బకు నిత్యావసరాల ధరలు సామాన్యులకు అందుబాటులో లేకుండా పోతాయి. దీంతో పొట్టపోసుకునేందుకు లక్షలాది మంది ప్రజలు పట్టణ ప్రాంతాలకు వలస వస్తారు. తద్వారా ప్రజల ఆదాయాలు భారీగా పడిపోతాయి. పట్టణాల్లో ఉపాధి అవకాశాలు సన్నగిల్లిపోతాయి. అంతిమంగా తీవ్ర వినాశనం సంభవిస్తుంది’ అని ఐపీసీసీ తెలిపింది. 1.5 డిగ్రీలు నియంత్రిస్తే... పోలండ్‌లోని కటోవిస్‌లో ఈ ఏడాది డిసెంబర్ 2 నుంచి 14 వరకూ జరిగే వాతావరణ మార్పుల సదస్సులో ఈ నివేదికపై ప్రపంచదేశాలు చర్చించి గ్లోబల్ వార్మింగ్ నియంత్రణకు తీసుకోవాల్సిన చర్యలపై ప్రణాళిక రూపొందించనున్నాయి. ఒకవేళ సగటు ఉష్ణోగ్రతలో పెరుగుదలను 1.5 డిగ్రీల సెల్సియస్‌లోపు నియంత్రించగలిగితే వాతావరణ మార్పుల కారణంగా ప్రభావితమయ్యే కోట్లాది మంది ముప్పు నుంచి బయటపడతారు. అలాగే ఆసియాలోని దేశాల్లో వరి, గోధుమ, మొక్కజొన్న పంటల దిగుబడి నష్టాలు గణనీయంగా తగ్గుతాయి. 2050 నాటికి పేదరికం ఊహించినస్థాయిలో పెరగదు. 2100 నాటికి ప్రపంచవ్యాప్తంగా సముద్రమట్టాల పెరుగుదలను 10 సెం.మీ. మేరకు తగ్గించవచ్చు. కర్బన ఉద్గారాలను 2035 నాటికి 45 శాతానికి తగ్గించాలని ఐపీసీసీ సూచించింది. అప్పుడే గ్లోబల్ వార్మింగ్ కారణంగా ఎదురయ్యే పెనుముప్పును సమర్ధవంతంగా ఎదుర్కొనగలమని స్పష్టం చేసింది. -
కాబోయే తల్లికి ముఖ్య పరీక్షలివి
కాబోయే తల్లికి ఈ కింది పరీక్షలు క్రమం తప్పకుండా చేస్తుంటారు. ఆ పరీక్షలేమిటీ, అవి ఎందుకు చేస్తారంటే... ⇒ అధిక రక్తపోటు (బీపీ టెస్ట్): గర్భిణికి రక్తపోటు ఎక్కువగా ఉంటే అది బిడ్డ ఆరోగ్యంపై, ఎదుగుదలపై ప్రభావం చూపవచ్చు. ఒక్కోసారి రక్తపోటు అధికం కావడం వల్ల కాబోయే తల్లికి ఫిట్స్, గుండె సవుస్యలు రావచ్చు. అందుకే... క్రవుం తప్పకుండా అధిక రక్తపోటు ఉందో లేదో చూడటం అవసరం. ⇒ ఏ గ్రూపు రక్తం?... తల్లి రక్తం ఏ గ్రూపునకు చెందిందో తెలుసుకోవడం అవసరం. రక్తంలో సాధారణంగా ఏ, బీ, ఏబీ, ఓ గ్రూపులు ఉంటాయన్నది తెలిసిందే. ఇందులో ప్రతి గ్రూపులోనూ పాజిటివ్, నెగెటివ్ అనే రెండు రీసస్ ఫ్యాక్టర్స్ ఉంటాయి. తల్లీ, తండ్రీ... ఇద్దరిదీ ఏ గ్రూపు రక్తం అయినా ఇద్దరి రీసస్ ఫ్యాక్టర్ పాజిటివ్ అయితే ఇబ్బంది లేదు. తల్లిది నెగెటివ్, తండ్రిది పాజిటివ్ అయి, పుట్టబోయే బిడ్డ రీసస్ ఫ్యాక్టర్ నెగెటివ్ అయినా పర్లేదు. కాని తల్లి ఫాక్టర్ నెగెటివ్ అయి, తండ్రిది పాజిటివ్ అయి, ఆ పాజిటివ్ ఫ్యాక్టర్ బిడ్డకు వచ్చినప్పుడు వూత్రం పాపకు పుట్టుకతోనే ఆరోగ్యసవుస్యలు వస్తాయి. తల్లిలోని యాంటీబాడీస్ పాపలోకి ప్రవేశించి పాప రక్తకణాలను దెబ్బతీయడమే దీనికి కారణం. అయితే ఈ సవుస్య మెుదటి ప్రెగ్నెన్సీ కంటే రెండోసారి గర్భధారణ సవుయంలో తప్పనిసరి. తల్లిదండ్రుల గ్రూపులు తెలుసుకుని, యంటీ–డీ అనే ఒకే ఒక ఇంజెక్షన్ ద్వారా పుట్టబోయే బిడ్డలో కాంప్లికేషన్స్ నివారించడమే కాదు, బిడ్డ ప్రాణాన్నీ రక్షించవచ్చు. ⇒ రక్తహీనత నిర్ధారణ పరీక్ష: మన దేశంలోని దాదాపు మహిళలందరిలోనూ ఉన్న ప్రధాన లోపం రక్తహీనత. ఫలితంగా బలహీనంగా ఉండటం, చిన్న పనికి వెంటనే అలసిపోవడం వంటి లక్షణాలు తల్లుల్లో కనిపిస్తుంటాయి. ఐరన్ వూత్రలతో ఈ పరిస్థితి నివారించవచ్చు. అందుకే కాబోయే తల్లులందరికీ ఈ పరీక్ష నిర్వహిస్తుంటారు. ⇒ బ్లడ్ షుగర్ పరీక్ష: గర్భిణి రక్తంలో చక్కెర పాళ్లు తెలుసుకోవడం చాలా అవసరం. గర్భంతో ఉన్నప్పుడు తల్లి ఎలాంటి ఆహారం తీసుకున్నా... ఆ సవుయంలో స్రవించే కొన్ని హార్మోన్ల వల్ల రక్తంలో చక్కెర పాళ్లు పెరిగేందుకు అవకాశం ఉంది. దాంతో ఉవ్మునీరు పెరగడం, శిశువ# పరివూణం పెరగడం వంటివి జరగవచ్చు. ఫలితంగా పాప గడువ#కు వుుందే పుట్టడం (ప్రీమెచ్యూర్ డెలివరీస్), లేదా పిండం గర్భంలోనే చనిపోవడం వంటివి జరిగే ఆస్కారం ఉంది. అందుకే క్రవుం తప్పకుండా బ్లడ్ షుగర్ పాళ్లు తెలుసుకుని, ఒకవేళ అది ఎక్కువగా ఉంటే నియంత్రణలో ఉంచుకోవడం అవసరం. గర్భిణుల్లో వుుందు నార్మల్‌గా ఉన్నా... వుుఖ్యంగా ఏడు, తొమ్మిది వూసాలప్పుడు ఈ చక్కెరపాళ్లు అకస్మాత్తుగా పెరిగే అవకాశం ఉంది. అందుకే ఈ సవుయంలో ఈ పరీక్షలు వురింత అవసరం. ⇒సిఫిలిస్ పరీక్ష: ఇది సెక్స్ ద్వారా వ్యాప్తి చెందే ఒక వ్యాధి. తల్లికి నిర్వహించిన పరీక్షల్లో ఇది ఉన్నట్లు తేలితే వెంటనే చికిత్స తీసుకోవాలి. లేకపోతే... అబార్షన్‌కు దారితీయవచ్చు. లేదా వుృతశిశువ# పుట్టవచ్చు. ⇒హెపటైటిస్–బి టెస్ట్: హైపటైటిస్–బి వైరస్ వల్ల సంక్రమించే ఒక వ్యాధి అన్న విషయం తెలిసిందే. అది గర్భంలోని పాపకు పుట్టుకతో రాకుండా నిరోధించేందుకు ఈ పరీక్ష అవసరం. ⇒ హెచ్ఐవీ పరీక్ష: ఎయిడ్స్ వ్యాధి నిర్ధారణకు చేసే పరీక్ష ఇది. కాబట్టి గర్భిణులందరికీ ఈ పరీక్ష తప్పనిసరి. ⇒ వుూత్ర పరీక్ష: ఈ పరీక్ష ద్వారా వుూత్రంలో చక్కెరపాళ్లు, ప్రొటీన్లు ఏమైనా ఉన్నాయేమో చూడాలి. యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ ఏమైనా ఉన్నాయేమో కూడా చూడాలి. యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్లు ఉండి దానికి సరైన చికిత్స తీసుకోకపోతే పాప గడువ#కు వుుందే పుట్టడం (ప్రీమెచ్యూర్ డెలివరీస్) వంటివి జరగవచ్చు. లేదా బిడ్డ బరువ# తక్కువగానూ పుట్టవచ్చు. ⇒ థైరాయిడ్ పరీక్ష: బిడ్డ ఆరోగ్యకరమైన ఎదుగుదల కోసం తల్లిలో స్రవించే థైరాయిడ్ హార్మోన్ ఎంతో అవసరం. బిడ్డ గర్భంలో ఉండే వ్యవధిలో మెుదటి సగం కాలంలో పాప పెరుగుదలకు తల్లి థైరాయిడ్ హార్మోన్‌నే ఉపయోగపడుతుంది. కాబట్టి కాబోయే తల్లిలో ఏవైనా థైరాయిడ్ సవుస్యలుంటే, వాటిని చక్కదిద్దడం వల్ల తల్లిలో అబార్షన్ వంటి సవుస్యలనూ, బిడ్డలో ఎదుగుదల లోపాలనూ అరికట్టడానికి ఈ పరీక్ష ఎంతో అవసరం. బిడ్డలో లోపాలు తెలుసుకోవడం కోసం... పాప పుట్టకవుుందే బిడ్డలో లోపాలేమైనా ఉన్నాయేమో తెలుసుకునేందుకు పిండదశలోనే కొన్ని పరీక్షలు చేస్తారు. ప్రధానంగా స్కానింగ్ ప్రక్రియ ద్వారా నిర్వహించే పరీక్షలివి... బిడ్డ గురించి చాలా విషయాలను తెలుసుకోవడం కోసం స్కానింగ్ పరీక్షలు ఉపయోగపడతాయి. ఉదాహరణకు కొన్ని... ⇒ న్యూకల్ ట్రాన్స్ల్యుయెన్సీ టెస్ట్: బిడ్డలో డౌన్స్ సిండ్రోమ్ వంటి జన్యుపరమైన లోపాలను తెలుసుకోడానికి ఈ పరీక్ష ఉపయోగపడుతుంది. పదమూడు వారాలప్పుడు చేసే ఈ పరీక్షతో ఇంకా... ⇒ పాప పుట్టబోయే తేదినీ వురింత నిర్దిష్టంగా కనుగొనడం ⇒ పుట్టబోయే పిల్లలు కవలలా, అయితే వారు ఏ రకం కవలలు అన్నది తెలుసుకోవడం ⇒అప్పటికే పుర్రె, బిడ్డ పూర్తి స్వరూపం రూపొందుతుంది కాబట్టి శరీరంలో ఏవైనా అవకరాలున్నాయేమో అన్నది తెలుసుకోవడం ⇒ క్రోమోజోవుల్ సవుస్యలు ఏవైనా ఉన్నాయేమో తెలుసుకోవడం సాధ్యవువ#తుంది. ఈ స్కాన్‌ద్వారా దాదాపు 90% సవుస్యలను కనుగొని వాటిని రూల్ అవ#ట్ చేయవచ్చు. ⇒ ఫీటల్ అనావులీ స్క్రీనింగ్: అల్ట్రా సౌండ్ స్కానింగ్ ప్రక్రియ ద్వారా పుట్టబోయే బిడ్డలో ఏవైనా లోపాలు ఉన్నాయేమో తెలుసుకునేందుకు ఈ పరీక్ష చేస్తారు. సాధారణంగా ఇది ప్రెగ్నెన్సీలో 18–20 వారాలప్పుడు చేసే పరీక్ష. ఈ పరీక్ష ద్వారానే పుట్టబోయే బిడ్డలో ఏవైనా గుండెకు సంబంధించిన లోపాలుంటే తెలుసుకుంటారు. ఫలితంగా ఏదైనా అవసరం ఉంటే పుట్టిన వెంటనే తక్షణ చికిత్స అందించి, పాపను రక్షించుకోడానికి వీలుంటుంది. గ్రహణం మొర్రి (క్లెఫ్ట్ లిప్), వెన్నెవుుకలో లోపాలు లాంటివి ఈ పరీక్ష ద్వారా తెలుసుకునే వీలుంది. ఇలాంటి లోపాలుంటే ఎంత చిన్న వయస్సులో శస్త్రచికిత్స ద్వారా సరిచేస్తే అంతగా సత్ఫలితాలుంటాయి. ఈ స్కాన్లతో పాటు కొన్ని రక్త (ప్రోటీన్) పరీక్షలతో 95% సవుస్యలను తెలుసుకుని, అవి లేవని నిర్ధారణ చేయవచ్చు. ప్రెగ్నెన్సీలో డిప్రెషన్, యాంగై్జటీలకు దూరంగా... ⇔ మీకు ఇష్టమైన హాబీలు పెంపొందించుకోవాలి. వ్యాపకాలను సృష్టించుకోవాలి. దీనివల్ల మీ మూడ్స్ ఆహ్లాదంగా ఉంటాయి. కంటినిండా నిద్రపోవాలి. ⇔ప్రవసం గురించి ఆందోళన పడకండి. అది చాలా హాయిగా జరిగిపోతుందని అనుకోండి. సిజేరియన్ గురించి, పురిటినొప్పుల గురించి ⇔భయపడకండి. బిడ్డపుట్టాక పాలు పడతాయా లేదా అని ఇప్పటి నుంచే ఆందోళన చెందకండి. ఇలా అనవరసమైన ఆందోళనల వల్ల బిడ్డ మీద ప్రతికూల ప్రభావాలు ఉంటాయని అధ్యయనాలు చెబుతున్నాయి. ⇔ఫ్రెండ్స్, కుటుంబసభ్యుల నుంచి వచ్చే సలహాలు, సూచనల్లో మీరు అనుసరించగలిగినవే చేయండి. ⇔ మీకు శ్రమకలిగించే మల్టీటాస్కింగ్ వంటివి ఆ సమయంలో చేయకండి. మీకు మానసిక ఒత్తిడి కలిగించే పనులేమీ చేయవద్దు. ⇔ఈ టైమ్‌లో యాంగై్జటీని తగ్గించడానికి మంచి పుస్తకాలు చదవడం, టీవీలో ఉల్లాసాన్నిచ్చే హాస్యభరితమైన కార్యక్రమాలు చూడటం వంటి పనులు చేయండి. ⇔ ప్రతిదీ మీరే స్వయంగా చేయాలని అనుకోకండి. కొన్ని ఇంటి పనులు మీ కుటుంబసభ్యులకూ అప్పగించండి. డాక్టర్ భావన కాసు కన్సల్టెంట్ అబ్స్టెట్రిషియన్ అండ్ గైనకాలజిస్ట్, బర్త్ రైట్ బై రెయిన్బో, హైదరాబాద్