సాక్షి, హైదరాబాద్: మారుతున్న జీవనశైలి, పెరుగు తున్న మానసిక ఒత్తిళ్లు కొత్త రోగాలకు కారణమ వుతున్నాయి. వయసుతో నిమిత్తం లేకుండా అందరికీ ఆరోగ్య సమస్యలు సృష్టిస్తున్నాయి. ఇప్పటి వరకు 50 ఏళ్లు దాటిన వారిలో కనిపించే మెదడులో రక్తస్రావం సమస్య ఇప్పుడు యువకులనూ బాధిస్తోంది. భరించలేని తలనొప్పితో మొదలయ్యే ఈ సమస్య మనిషిని పూర్తిగా నిశ్చేష్టులుగా మార్చి స ్పృహ కోల్పోయేలా చేస్తోంది.
సకాలం లో చికిత్స అందిస్తేగానీ మళ్లీ సాధారణ స్థితికి రావడం కష్టంగా మారుతోంది. మెదడులో రక్తస్రావం కేసులు రాష్ట్రవ్యాప్తంగా పెరుగుతున్నట్లు ఆరోగ్యశ్రీ తాజా నివేదికలో వెల్లడైంది. ముఖ్యంగా ఈ సమస్యతో బాధపడు తున్న యువకుల సంఖ్య ప్రమాదకరంగా పెరుగుతున్నట్లు నివేదిక చెబుతోంది. బాధితుల్లో 35 ఏళ్లలోపు వారే 13 శాతం ఉన్నట్లు వెల్లడైంది. ఇవి కేవలం ఆరోగ్యశ్రీ పరిధిలోని చికిత్సల లెక్కలే. రాష్ట్రవ్యాప్తంగా నమోదవుతున్న కేసుల సంఖ్య దీనికి రెండింతలుగా ఉంది.
పరిణామాలేంటి..?
మెదడు నుంచి బయటకొచ్చిన రక్తం గడ్డకట్టి మెదడు పనితీరుపై ప్రతికూల ప్రభావం చూపుతుంది. శరీరం అదుపుతప్పి రోగికి తల తిరిగినట్లు అవుతుంది. శరీరం పట్టు కోల్పోతుంది. భరించలేనంత తలనొప్పితో వాంతులు అవుతాయి. మూర్చపోవడం, పక్షవాతం వంటి లక్షణాలతో స ్పృహ కోల్పోవడం జరుగుతుంది. ఇలా అన్ని రకాల సమస్యలతో కోమాలోకి జారుకుంటారు.
అధిక రక్తపోటు వల్లే..
అధిక రక్తపోటు కారణంగానే మెదడులో రక్తస్రావం జరుగుతుంది. రక్తస్రావమైన 3 గంటల్లో చికిత్స అందిస్తే ఫలితం ఉంటుంది. రోడ్డు ప్రమాదాల్లో తలకు గాయమైన సందర్భాల్లో ప్రాణాపాయం ఎక్కువగా ఉంటుంది. రోగి ఎప్పుడు సాధారణ స్థితికి చేరుకుంటారో చెప్పడంకష్టం. – డాక్టర్ బోడకుంట్ల ప్రభాకర్,
న్యూరోసర్జన్, వరంగల్
కారణాలేంటి..?
అధిక రక్తపోటు, నిద్రలేమి, మానసిక ఒత్తిళ్లు, రహదారి ప్రమాదాలు, పుట్టుకతోనే రక్త నాళాల్లో సమస్యలు, మోతాదుకు మించి గర్భనిరోధక మాత్రల వినియోగం మెదడు రక్తస్రావానికి కారణమవుతున్నాయి. రక్తపో టు అదుపుతప్పినప్పుడు మెదడులో నాళాలు చిట్లి మెదడు పైభాగంలో రక్తస్రావం అవుతుంది.
ఆరోగ్యశ్రీ నివేదిక ప్రకారంమెదడు రక్తస్రావం శస్త్ర చికిత్సలు
ఏడాది చికిత్సలు
2014-15 1,444
2015-16 1,608
2016-17 1,766
2017-18 1,892
Comments
Please login to add a commentAdd a comment