ఢిల్లీలో కాలుష్య స్థాయి 300కి చేరుకుందని సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ పేర్కొంది. కాలుష్య స్థాయి పెరుగుతోందని, పొగమంచు సమస్య అంతకంతకు తీవ్రతరం అవుతోందంటూ వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ జారీ చేసింది కూడా. అంతలా తీవ్ర వాయు కాలుష్యంతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న దేశా రాజధాని నడిబొడ్డున పాశ్చాత్య దేశాల కంటే నాణ్యమైన గాలితో కూడిన పరిశుభ్రమైన ఇల్లు ఒకటి ఉంది. అదెలా సాధ్యం అనుకోకండి. ఎందుకంటే ఈ జంట సాధ్యం చేసి చూపించి ఆదర్శంగా నిలిచింది. ఇంతకీ ఆ జంట ఏం చేశారంటే..
మన దేశ రాజధాని ఢిల్లీ తీవ్ర వాయు కాలుష్యం కోరల్లో చిక్కుకుని విలవిల్లాడుతోంది. ముఖ్యంగా శీతాకాలంలో పొగమంచు కారణంగా మరింత అనారోగ్య సమస్యలను ఎదుర్కొంటున్నారు. ఈ సీజన్‌లో కాలుష్యం, పొగమంచు కారణంగా ఢిల్లీలోని స్కూళ్లు, కాలేజ్‌లు కూడా మూతపడుతున్నాయి. అంతలా ఘోరంగా ఉందక్కడ పరిస్థితి. పీల్చుకునే గాలిలోనే నాణ్యతలేకపోవడంతో అక్కడ ప్రజలు అల్లాడిపోతున్నారు. వివిధ అనారోగ్య సమస్యలతో ఆస్పత్రుల పాలవ్వుతున్నారు. ఇలాంటి ఘోరమైన స్థితిలో ఓ జంట ఇల్లు వంద శాతం గాలి నాణ్యతో అందంగా ఉంది.
అది ఇల్లు పర్యావరణానికి స్వర్గధామమా..! అన్నట్లుగా పచ్చదనంతో అలుముకుని ఉంది. ఢిల్లీకి చెందిన పీటర్ సింగ్, నీనో కౌర్ దంపుతులది ఆ ఇల్లు. ఢిల్లీలోనే ఇలాంటి ఇల్లు కూడా ఉందా అని విస్తుపోయాలా అత్యంత పరిశుభ్రంగా ఉంది. మండు వేసవిలో సైతం ఆ ఇంటిలో కేవలం 25 డిగ్రీల ఉష్ణోగ్రతే ఉంటుందట. ఈ విధమైన పర్యావరణానుకుల జీవనశైలిని నీనా కేన్సర్‌తో బాధపడుతున్నప్పటి నుంచి ప్రారంభించారట.
ప్రస్తుతం నీనోకి 75 ఏళ్లు. ఆరోగ్యం మెరుగ్గా ఉంచుకునేందుకు సాగిన ప్రయాణం ఇలా పర్యావరణానికి పెద్దపీటవేసేలా దారితీసిందని చెబుతున్నారు పీటర్ సింగ్, నీనో దంపతులు. ఇంట్లోనే చేపల పెంపంక, కూరగాయల మొక్కల పెంపకం. ఈ రెండింటినీ ఏకీకృతం చేసేలా వ్యవసాయం చేస్తోంది ఆ జంట. వారికి నాలుగు పెద్దపెద్ద చేపల ట్యాంకులు ఉన్నాయి.
ఆ చెరువుల్లోని చేపలు అమ్మోనియా అధికంగా ఉంటే నీటిని ఉత్పత్తి చేస్తాయి. వీటిని ఫిల్టర్ చేసి మొక్కలకు సరఫరా చేస్తారు. మళ్లీ మొక్కలు నీటిలోని పోషకాలను గ్రహించగా మిగిలిని నీటిని శుద్ధిచేసి తిరిగి చేపల ట్యాంకులోకి పంపిస్తారు. అంతేగాదు వర్మికంపోస్ట్, కోకో పీట్ ఉపయోగించి దాదాపు పదివేల నుంచి 15 వేల దాక వివిధ రకాల మొక్కలు పెంచుతున్నట్లు తెలిపారు. తాము దుకాణానికి వెళ్లాల్సిన పనిలేదంటున్నారు. ఇంట్లోకి అవసరమయ్యే అన్ని రకాల కూరగాయాలను తామే పండిస్తామని సగర్వంగా చెప్పారు.
అలాగే తమ వంటగది వ్యర్థాలను సేంద్రీయ కంపోస్ట్‌గా రీసైకిల్ చేసేలా ఏర్పాట్ల తోపాటు రెయిన్ వాటర్‌ని శుద్ది చేసి ఉపయోగించుకునేలా ప్రత్యేకంగా రూపొందించారట. ఇలా పర్యావరణ హితంగా జీవించడానికి కార్యకర్తనో, సెలబ్రిటీనో కానవసరం లేదని చాటిచెప్పారు. బురదలో తామర పువ్వు వికసించినట్లుగా.. అత్యంత కాలుష్యంతో కొట్టుమిట్టాడుతున్న ఢిల్లీలో ఈ పచ్చదనంతో కూడిన ఇల్లు ఓ కొత్త ఆశను రేకెత్తించింది!. నిజానికి అందరూ ఇలా పర్యావరణానుకూలంగా జీవించడం ప్రారంభిస్తే కాలుష్యం క్లీన్ అయిపోతుంది ఆరోగ్యం సొంతమవుతుంది కదూ..!.
(చదవండి: కేరళ సంప్రదాయ ‘కసావు చీర’తో ప్రియాంక గాంధీ ప్రమాణ స్వీకారం..!)
Comments
Please login to add a commentAdd a comment