పెళ్లంటే నూరేళ్ల బంధం.. పెళ్లిళ్లు స్వర్గంలో నిర్ణయించబడతాయి.. పెళ్లి కొత్త జీవితానికి నాంది.. పెళ్లి అనేక మధురానుభూతులకు, జ్ఞాపకాలకు వేదిక.. ఇలాంటి పదాలన్నీ తరుచూ వింటుంటాం.. ఒకప్పుడు పెళ్లంటే గౌరవం, నమ్మకం ఉండేది. కానీ ఇప్పుడు పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. దంపతుల మధ్య అపార్థాలు, చిన్న సమస్యలనే పెద్దదిగా చూడటం.. ఇలా అనేక కారణాలతో పెళ్లైన వెంటనే విడాకుల బాట పడుతున్నారు.
తాజాగా ఓ జంట వివాహం జరిగిన మూడు అంటే మూడు నిమిషాలకే విడాకులు తీసుకుంది. న్యాయమూర్తి సైతం ఆ జంటకు విడాకులు మంజూరు చేశాడు. వినడానికి కాస్తా ఇబ్బందికరంగానే ఉన్నప్పటికీ ఈ ఘటన కువైట్ దేశంలో జరిగింది. అయితే ఈ సంఘటన 2019 జరగ్గా.. తాజాగా మరోసారి వైరల్‌గా మారింది.
కువైట్‌లో వధూవరులు, తమ వివాహ రిజిస్ట్రేషన్ కోసం న్యాయమూర్తి ఎదుట సంతకాలు పెట్టేందుకు వెళ్లారు. ఆ కార్యక్రమం ముగిసిన అనంతరం కోర్టు నుంచి బయటకు వస్తున్న వేళ, వధువు పొరపాటున కాలు జారి కింద పడిపోయింది. దీంతో వెంటనే పక్కనే ఉన్న వరుడు ఆమెను తెలివి తక్కువదానా అంటూ పరుష పదజాలానికి దిగాడు.
తనకు సాయం చేయాల్సింది పోయి, పరువు తీశావంటూ అవమానించడంతో వధువు ఆగ్రహం వ్యక్తం చేసింది. అతనితో తన జీవితం సాఫీగా ఉండదని భావించిన ఆమె, ఒక్కసారిగా జడ్జి దగ్గరకు వెళ్లి, విషయం చెప్పి, విడాకులు కావాలని అడిగింది. దీని న్యాయమూర్తి అంగీకరించి వెంటనే విడాకులు మంజూరు చేేశాడు.
అయితే పెళ్లైన మూడు నిమిషాలకే ఆ జంట విడాకులు తీసుకోవడంతో.. దేశ చరిత్రలో అతి తక్కువ సమయం వివాహంగా రికార్డులకెక్కింది. ఇదిలా ఉండగా గతంలో దుబాయ్‌లో ఓ జంట పెళ్లయన 15 నిమిషాల వ్యవధిలో విడాకులకు దరఖాస్తు చేసి, మంజూరు చేయించుకుంది.
Comments
Please login to add a commentAdd a comment