
పెళ్లంటే నూరేళ్ల పంట అంటారు. కానీ కువైట్‌లో ఓ జంట మాత్రం మూడు నిమిషాలకే ఈ పెళ్లి మాకొద్దు బాబోయ్ అంది. వినడానికి వింతగా ఉన్నా ఇది నిజమే. కువైట్‌లో గత నెలలో జరిగిన ఈ ఘటన ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. కువైట్‌లో ఓ జంట తమ పెళ్లికి సంబంధించిన రిజిస్ట్రేషన్‌పై జడ్జి ఎదుట సంతకాలు పెట్టారు. అనంతరం కోర్టు నుంచి బయటకు వస్తున్న క్రమంలో పెళ్లికూతురు పొరపాటున కింద పడింది. పక్కనే ఉన్న వరుడు ఆ అమ్మాయికి సహాయం చేయాల్సింది పోయి.. కింద పడినందుకు పరుష పదజాలంతో దూషించాడు. అంతే ఒక్కసారిగా ఉక్రోషానికి గురైన వధువు జడ్జి దగ్గరకు వెళ్లి విడాకులు కావాలని అడగటం.. ఆయన ఇవ్వడం చకచకా జరిగిపోయింది.
కేవలం మూడు నిమిషాల వ్యవధిలోనే ఇదంతా జరిగిందంటే ఆశ్చర్యం కలగకమానదు. కువైట్ చరిత్రలోనే ఇంత తక్కువ వ్యవధిలో విడాకులు తీసుకున్న జంటగా వీరు గుర్తింపు పొందారని స్థానిక మీడియా పేర్కొంది. ఇంతకుముందు దుబాయ్‌లో ఓ జంట 15 నిమిషాల వ్యవధిలో విడాకులు తీసుకున్నా.. వీరు కేవలం 3 నిమిషాల్లోనే విడిపోయారని వెల్లడించింది. ప్రపంచంలో అత్యంత వేగంగా విడాకులు తీసుకున్న జంట కూడా ఇదే కావచ్చని అభిప్రాయపడింది.
Comments
Please login to add a commentAdd a comment