
రెజిమెంటల్ బజార్‌లో విషాద ఘటన చోటుచేసుకుంది. బిల్డింగ్ మీద నుంచి భార్యభర్తలు జారిపడ్డారు.
సాక్షి, సికింద్రాబాద్: రెజిమెంటల్ బజార్‌లో విషాద ఘటన చోటుచేసుకుంది. బిల్డింగ్ మీద నుంచి భార్యభర్తలు జారిపడ్డారు. నిర్మాణంలో ఉన్న భవనం రెండో అంతస్తు నుంచి దంపతులు గిరి, లచ్చమ్మ ప్రమాదవశాత్తు పడిపోయారు.
ఆసుపత్రి కి తరలిస్తుండగా భర్త గిరి మృతి చెందగా, కొన ఊపిరితో ఉన్న భార్య లచ్చమ్మ గాంధీకి తరలించారు. గోపాలపురం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.