మా అబ్బాయి ఎయిర్ఫోర్సులో చేరతాడట | My son interested in IAF, says Sachin Tendulkar | Sakshi
Sakshi News home page

మా అబ్బాయి ఎయిర్ఫోర్సులో చేరతాడట

Published Thu, Oct 8 2015 4:07 PM | Last Updated on Sun, Sep 3 2017 10:39 AM

మా అబ్బాయి ఎయిర్ఫోర్సులో చేరతాడట

మా అబ్బాయి ఎయిర్ఫోర్సులో చేరతాడట

తన కొడుకు వైమానిక దళంలో చేరేందుకు ఎక్కువ ఉత్సాహం చూపిస్తున్నాడని క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్ చెప్పాడు.

తన కొడుకు వైమానిక దళంలో చేరేందుకు ఎక్కువ ఉత్సాహం చూపిస్తున్నాడని క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్ చెప్పాడు. అయితే, అతడు చేరతాడా లేదా అనే విషయం అప్పుడే మాత్రం చెప్పలేమన్నాడు. వైమానిక దళంలో గౌరవ గ్రూప్ కెప్టెన్గా ఉన్న సచిన్.. హిండన్ బేస్ వద్ద ఎయిర్ ఫోర్స్ డే పెరేడ్ సందర్భంగా మీడియాతో మాట్లాడాడు.

వాస్తవానికి తన కొడుకును కూడా ఇక్కడకు తీసుకొద్దామనుకున్నానని, అతడికి ఎయిర్ ఫోర్స్ అంటే చాలా ఇష్టమని అన్నాడు. అర్జున్ టెండూల్కర్ వయసు ఇప్పుడు 16 ఏళ్లు. సుఖోయ్ యుద్ధ విమానంలో వెళ్లాలని గతంలో చెప్పిన విషయాన్ని గుర్తు చేయగా, అది ఇంతవరకు కుదరలేదని మాస్టర్ చెప్పాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement