న్యూఢిల్లీ: తాలిబన్లు అఫ్గనిస్తాన్‌ను ఆక్రమించిన నేపథ్యంలో సరిహద్దు భద్రతా అంశంలో ఆందోళనలు వ్యక్తమవుతున్న విషయం విదితమే. ఈ నేపథ్యంలో భారతదేశ సరిహద్దు ప్రాంతంలో మరింత కట్టుదిట్టమైన భద్రత చర్యలతో పాటు సాయుధ బలగాలకు సరికొత్త వ్యూహాత్మక శిక్షణ ఇవ్వాలని కేంద్ర భద్రత సంస్థ సూచించింది. అఫ్గన్ సరిహద్దు ప్రాంతంలో ఉగ్రవాదులు చొరబడకుండా మోహరించి ఉన్న దళాలను సరికొత్త వ్యూహంతో ఎదుర్కొనేలా సంసిద్ధం చేయాలని నొక్కి చెప్పింది.
అఫ్గానిస్తాన్‌లో కొత్తగా ఏర్పాటైన ప్రభుత్వాన్ని చూస్తే అడుగడుగునా పాకిస్తాన్ ముద్ర స్పష్టంగా కనిపించడమే కాక భారత్‌పై దాడులు చేసిన హక్కానీలకు కీలక పదవులు ఇచ్చిన సంగతి తెలిసిందే. దీంతో భారత్ సరిహద్దు ప్రాంతాలైన పాకిస్తాన్ ఆక్రమిత కశ్మీర్, లోతట్టు ప్రాంతాలలో భద్రతా దళాలను మరింతగా బలోపేతం చేసే దిశగా చర్యలు తీసుకోమని కోరింది. భద్రత దళాలైన బీఎస్‌ఎఫ్, ఎస్‌ఎస్‌బీ, సీఆర్‌పీఎఫ్ దళాలు అత్యంత ధైర్య సాహసాలతో ఉగ్రవాదులను తిప్పికొట్టగల సామర్థ్యం కలవారని ఆర్మీ ఉన్నతాధికారి ఈ సందర్భంగా పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment