బ్రహ్మోస్ క్షిపణి పరీక్ష విజయవంతం | Brahmos missile test successful | Sakshi
Sakshi News home page

బ్రహ్మోస్ క్షిపణి పరీక్ష విజయవంతం

Published Sat, May 28 2016 1:39 AM | Last Updated on Mon, Sep 4 2017 1:04 AM

బ్రహ్మోస్ క్షిపణి పరీక్ష విజయవంతం

బ్రహ్మోస్ క్షిపణి పరీక్ష విజయవంతం

న్యూఢిల్లీ : భూ ఉపరితల లక్ష్యాలను ఛేదించే సూపర్‌సోనిక్ క్షిపణి బ్రహ్మోస్‌ని భారత్ శుక్రవారం విజయవంతంగా పరీక్షించింది. రాజస్తాన్‌లోని పోఖ్రాన్ కేంద్రంలో భారత వాయుసేన ఈ పరీక్ష నిర్వహించింది. అనుకున్న లక్ష్యాలను క్షిపణి కచ్చితత్వంతో అధిగమించిందని బ్రహ్మోస్ ఏరోస్పేస్ ప్రకటించింది.

లోపరహిత సామర్థ్యాలు కలిగిన ఈ వ్యవస్థ త్రివిధ దళాలకు సాధికారత చేకూర్చనుం ది.మన విమానాల రాకపోకలను పసిగట్టేందుకు శత్రుదేశాలు సరిహద్దుల వెంట ఏర్పాటుచేసిన  రాడార్లు, కమ్యూనికేషన్ వ్యవస్థలను  కూల్చేసేందుకు ఈ క్షిపణిని భారత వాయుసేన గత ఏడాది తీసుకుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement