న్యూఢిల్లీ : పుల్వామా ఉగ్రదాడికి ప్రతీకారకంగా భారత వైమానిక దళం చేసిన మెరుపు దాడుల నేపథ్యంలో భారత ప్రభుత్వం త్రివిధ దళాలకు సెలవులను రద్దు చేసింది. ప్రతీకార దాడులు జరిగే అవకాశం ఉంటుందనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకుంది. అలాగే భారత తీర ప్రాంతాలను అప్రమత్తం చేసింది. దీంతో తీర ప్రాంతాలను భద్రతా బలగాలు తమ ఆధీనంలోకి తీసుకున్నాయి.
ఈ మెరుపు దాడుల నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన భద్రతా వ్యవహారాల కమిటీ అత్యవసరంగా సమావేశమైంది. కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, రక్షణ శాఖ మంత్రి నిర్మలా సీతారమన్, ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ, విదేశాంగ శాఖ మంత్రి సుష్మాస్వరాజ్‌లు ఈ సమావేశానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా వైమానిక మెరపుదాడుల గురించి హోంశాఖ సెక్రటరీ, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ ప్రధానికి వివరించారు.
Comments
Please login to add a commentAdd a comment