న్యూఢిల్లీ: అంతర్జాతీయంగా దాదాపు 110 యుద్ధవిమానాల కొనుగోలుకు భారత వాయుసేన(ఐఏఎఫ్) శుక్రవారం రిక్వెస్ట్ ఫర్ ఇన్ఫర్మేషన్(ఆర్‌ఎఫ్‌ఐ) జారీచేసింది. జూలై 6లోపు తమ ప్రతిపాదనల్ని పంపాలని కోరింది. ఈ కాంట్రాక్టును దక్కించుకున్న సంస్థలు మొత్తం యుద్ధ విమానాల్లో 85 శాతాన్ని మేకిన్ ఇండియా కింద భారత్‌లో దేశీయ కంపెనీలతో కలసి తయారుచేయాలి.
మిగిలిన విమానాలను వినియోగానికి సిద్దంగా ఉన్న స్థితిలో అందజేయాలి. 15 బిలియన్ డాలర్ల(సుమారు రూ.97, 342 కోట్లు) విలువైన ఈ కాంట్రాక్టును దక్కించుకునేందుకు లాక్‌హీడ్ మార్టిన్, బోయింగ్, డసాల్ట్, బోయింగ్ వంటి సంస్థలు పోటీపడుతున్నాయి. ఎఫ్–16, ఎఫ్–18 కొనుగోలుపై భారత్ నిర్ణయంపైనే యుద్ధ విమానాలకు సంబంధించి తమతో రక్షణ సంబంధాలు ఆధారపడి ఉంటాయని అమెరికా తెలిపింది.
Comments
Please login to add a commentAdd a comment