పాక్‌తో పదిరోజులు.. చైనాతో 15రోజుల యుద్ధం! | Be ready for war, IAF chief to commanders | Sakshi
Sakshi News home page

పాక్‌తో పదిరోజులు.. చైనాతో 15రోజుల యుద్ధం!

Published Sun, Apr 30 2017 8:43 AM | Last Updated on Tue, Sep 5 2017 10:04 AM

పాక్‌తో పదిరోజులు.. చైనాతో 15రోజుల యుద్ధం!

పాక్‌తో పదిరోజులు.. చైనాతో 15రోజుల యుద్ధం!

సర్వసన్నద్ధంగా ఉండాలని కమాండర్లకు ఇండియన్‌ ఎయిర్‌ఫోర్స్‌ ఆదేశం

న్యూఢిల్లీ: మిలిటరీ అవసరాలు శరవేగంగా మారుతున్న ప్రస్తుత తరుణంలో పాకిస్థాన్‌తో 10 రోజుల యుద్ధం, చైనాతో 15రోజుల యుద్ధం చేసేందుకు వీలుగా సర్వసన్నద్ధంగా ఉండాలని ఇండియన్‌ ఎయిర్‌ఫోర్స్‌ (ఐఏఎఫ్‌) తన కమాండర్లను ఆదేశించింది. గతవారం  న్యూఢిల్లీలో ఐఏఎఫ్‌ కమాండర్ల సదస్సు జరిగింది. ఈ సందర్భంగా ఐఏఎఫ్‌ చీఫ్‌ బీఎస్‌ ధనోవా ఈ మేరకు కమాండర్లకు సంకేతాలు ఇచ్చినట్టు విశ్వసనీయవర్గాలు తెలిపాయి.

‘ఒకవేళ పాకిస్థాన్‌తో పదిరోజుల యుద్ధం, చైనాతో 15రోజుల యుద్ధం వస్తే సత్వరమే ఎదుర్కొనడానికి వీలుగా ఐఏఎఫ్‌ కమాండర్లు స్వరసన్నద్ధంగా ఉండాలని ఎయిర్‌చీఫ్‌ మార్షల్‌ బీఎస్‌ ధనోవా ఆదేశించారు. అత్యంత చురుకైన సన్నద్ధతతో, పోరాట సామర్థ్యాన్ని మరింత పెంచుకోవాలని సూచించారు’ అని ఆ వర్గాలు మీడియాకు చెప్పాయి.

తన అన్ని విభాగాల సన్నద్ధత ఎలా ఉందో తెలుపాలంటూ  ఇప్పటికే డైరక్టరేట్‌ ఆఫ్‌ ఎయిర్‌​ స్టాఫ్‌ ఇన్స్‌ఫెక్షన్‌కు ఆదేశాలు అందాయి. ఎయిర్‌ఫోర్స్‌ సిబ్బందిని, యుద్ధవిమానాలను పూర్తిస్థాయిలో ఆయుధాలు, క్షిపణులు, అలర్ట్‌ రాడర్‌ వ్యవస్థతో సర్వసన్నద్ధంగా ఉంచాలని సూచనలు అందాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement