![IAF Chief BS Dhanoa Says Flying The Rafale Made Him Happy - Sakshi](/styles/webp/s3/article_images/2019/09/20/BS-Dhanoa.jpg.webp?itok=G9ZjAhFd)
సాక్షి, న్యూఢిల్లీ : రఫేల్ యుద్ధ విమానాన్ని నడపటం తనను థ్రిల్‌కు గురిచేసిందని చెబుతూ ఇది మెర్సిడెస్ కారును నడిపినట్టే ఉందని భారత వైమానిక దళం చీఫ్ బీఎస్ ధనోవా అన్నారు. మారుతి కారును నడిపే వ్యక్తికి మెర్సిడెస్ అందిస్తే అతను హ్యాపీగా ఫీలవతాడని రఫేల్ యుద్ధ విమానాన్ని నడిపిన తనకూ అదే అనుభవం ఎదురైందని ఇండియా టుడే కాంక్లేవ్‌లో నేపథ్యంలో ఆయన చెప్పుకొచ్చారు. ఫ్రెంచ్ ఎయిర్‌బేస్ నుంచి రఫేల్‌ను ఎయిర్ చీఫ్ మార్షల్ ఈ ఏడాది జులైలో నడిపి దానిపై పట్టు పెంచుకున్నారు. భారత వైమానిక దళానికి రాఫేల్ శక్తివంతమైన వనరుగా మారుతుందని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు.
భారత వాయుసేన విమానాలు పురాతనమైనవన్న ఆందోళనపై స్పందిస్తూ వాయుసేనను ఆధునీకరించాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు. రాఫేల్‌తో మన వైమానిక సాధనాసంపత్తిలో గణనీయ మార్పులు చోటుచేసుకుంటాయని వ్యాఖ్యానించారు. ఏవియానిక్స్, మిసైల్, డేటా సహా పలు అంశాల్లో మనం చాలా ముందున్నామని పేర్కొన్నారు. బాలాకోట్ తరహా వైమానిక దాడుల గురించి ప్రశ్నించగా ఎలాంటి దాడులకైనా వాయుసేన సిద్ధంగా ఉందని, ప్రభుత్వమే ఓ నిర్ణయం తీసుకోవాల్సి ఉందని చెప్పారు. తాము సైనికేతర లక్ష్యాన్ని ఢీ కొట్టడం ద్వారా భారత్‌లో ఉగ్రవాదం ప్రేరేపిస్తే మీరు పీఓకే లేదా ఎక్కడ ఉన్నా మిమ్నల్ని లక్ష్యంగా చేసుకుంటామనే సంకేతాలను ఉగ్ర సంస్ధలకు పంపామని చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment