అభినందన్ రాఫెల్‌తో కౌంటర్‌ ఇచ్చుంటే..! | BS Dhanoa Said Outcome Different If Abhinandan Had Flown Rafale | Sakshi
Sakshi News home page

అప్పుడు గనుక రాఫెల్‌ ఉండి ఉంటే..!

Published Sun, Jan 5 2020 5:01 PM | Last Updated on Sun, Jan 5 2020 7:28 PM

BS Dhanoa Said Outcome Different If Abhinandan Had Flown Rafale - Sakshi

ముంబై: భారత వాయుసేన మాజీ ఎయిర్ చీఫ్ మార్షల్ బీఎస్ ధనోవా బాంబే ఐఐటీలో జరిగిన ఓ కార్యక్రమంలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. బాలాకోట్ దాడుల అనంతరం పాక్‌పై దాడికి అభినందన్ వర్ధమాన్ వెళ్లిన సమయంలో మనం వాడిన యుద్ధ విమానం మిగ్ -21. అయితే ఆ రోజు అభినందన్ దాని స్థానంలో రాఫెల్‌ యుద్ధ విమానంలో వెళ్లి  కౌంటర్ ఇచ్చి ఉంటే పరస్థితి మరోలా ఉండేదని అప్పటి ఎయిర్ ఫోర్స్ చీఫ్‌ బీఎస్ ధనోవా అన్నారు.

చదవండి: అభినందన్‌ మనోధైర్యానికి మరో గుర్తింపు

ఆ సమయంలో పాక్ ఎఫ్-16 యుద్ధ విమానాల్లో మిగ్-21పై దాడి చేయడంతో అది కూలిపోయి వింగ్ కమాండర్ అభినందన్ శత్రు దేశానికి చిక్కాడం తెలిసిందే. అదే ఎఫ్-16 కన్నా శక్తిమంతమైన రాఫెల్ మన చేతిలో ఉంటే ఫలితం వేరేలా ఉండేదని ఆయన తెలిపారు. ఇప్పటికైనా భారత అమ్ములపొదిలో రాఫెల్ చేరడం శుభపరిణామమని, రాఫెల్ వివాదంపై సుప్రీంకోర్టు సరైన తీర్పు ఇచ్చిందని బీఎస్ ధనోవా పేర్కొన్నారు.

చదవండి: ఆ జాబితాలో అభినందన్‌, సారా అలీఖాన్‌!

ఆ సమయానికి భారత్ చేతిలో రాఫెల్ యుద్ధ విమానాలు లేకపోవడానికి కారణమెవరంటూ ధనోవా పరోక్షంగా రాజకీయ పార్టీలనుద్దేశించి విమర్శలు చేశారు. నాడు అభినందన్ వర్థమాన్ రాఫెల్‌లో వెళ్లకపోవడానికి కారణమేంటని ప్రశ్నించారు. ఏ యుద్ధ విమానాన్ని కొనాలన్నది నిర్ణయించడానికి 10 సంవత్సరాల టైం తీసుకున్నారంటూ గతంలో అధికారంలో ఉన్న పార్టీలపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement