ఎఫ్–16 యుద్ధ విమానాలను భారత్‌లో తయారుచేయడానికి అమెరికా రక్షణ ఉత్పత్తుల సంస్థ లాక్‌హీడ్ ముందుకొచ్చింది
న్యూఢిల్లీ: ఎఫ్–16 యుద్ధ విమానాలను భారత్‌లో తయారుచేయడానికి అమెరికా రక్షణ ఉత్పత్తుల సంస్థ లాక్‌హీడ్ ముందుకొచ్చింది. భారత వాయుసేన నుంచి ఈ విమానాలకు ఆర్డర్ లభిస్తే ‘మేకిన్ ఇండియా’ కింద వాటిని ఇక్కడే ఉత్పత్తి చేస్తామంది. అంతేకాకుండా భారత్ నుంచే వాటిని ఇతర దేశాలకూ ఎగుమతి చేస్తామని తెలిపింది. అయితే వాయుసేనకు 100 ఎఫ్–16 జెట్ విమా నాలు సమకూర్చడానికి సంబంధించిన ఆర్డర్ కోసం స్వీడన్ కంపెనీ సాబ్‌తో లాక్‌హీడ్ పోటీ పడుతోంది. ఈ విమానాల తయారీ కేంద్రాన్ని భారత్‌కు తరలించాలన్న లాక్‌హీడ్ ప్రతిపాదనకు అమెరికా ప్రభుత్వం మద్దతు తెలిపింది.